నాగ చైతన్య శోభిత దూళిపాళ్ల మెడ లో మూడు ముళ్ళు వేసి ఏడడుగులు నడిచేసాడు. కొద్ధి సేపటి క్రితమే హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగ చైతన్య-శోభితల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. చైతు-శోభితల పెళ్లి ఫొటో కోసం అక్కినేని అభిమానులతో పాటుగా ఎంతోమంది ఎదురు చూస్తున్నారు.
మరి నాగ చైతన్య పెళ్లి కొడుకుగా, శోభిత పెళ్లి కూతురుగా ముస్తాబై పెళ్లి పీటలెక్కిన పిక్ లీకైంది. గోల్డ్ కలర్ శారీ లో ఒంటి నిండా ఆభరణాలతో శోభిత పెళ్లి కూతురుగా మెరిసిపోగా.. నాగ చైతన్య పంచె కట్టులో ట్రెడిషనల్ గా ముస్తాబయ్యాడు. శోభిత చేతిలో కొబ్బరి బొండం ఉండగా ఆమె నమస్కరిస్తున్న పిక్ వైరల్ గా మారింది.
నాగ చైతన్య-శోభితల వెడ్డింగ్ పిక్ ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది.