Advertisementt

అక్కడ పుష్ప 2 కు బిగ్ షాక్

Wed 04th Dec 2024 07:12 PM
pushpa 2  అక్కడ పుష్ప 2 కు బిగ్ షాక్
Pushpa 2 midnight show cancel అక్కడ పుష్ప 2 కు బిగ్ షాక్
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా ప్రేక్షకులు పుష్ప 2 మ్యానియా తో ఊగిపోతున్నారు. ఎప్పడెప్పుడు పుష్ప 2 చూసేద్దామా అని వెయిట్ చేస్తున్నారు. పుష్ప 1 బిగ్ హిట్ అవడం, అల్లు అర్జున్ పుష్ప 2 ప్రమోషన్స్, పుష్ప 2 ట్రైలర్, సాంగ్స్ అన్ని అంచనాలకు మించి ఉండడంతో పుష్ప 2 ని చూసేందుకు అందరిలో ఆసక్తి క్రియేట్ అయ్యింది. 

అందుకే మేకర్స్ ఈ రోజు నైట్ 9.30నుంచే స్పెషల్ ప్రీమియర్స్ తో రచ్చకు శ్రీకారం చుట్టారు. తెలుగు రాష్ట్రాల్లో నైట్ 9 నుంచే పుష్ప 2 జాతర మొదలు కాబోతుంది. మిగతా స్టేట్స్ లో మిడ్ నైట్, ఉదయం 6 గంటల లోపు పుష్ప 2 బెన్ ఫిట్ షోస్ మొదలు కాబోతున్నాయి. 

అయితే కర్ణాటకలో పుష్ప 2 కి బిగ్ షాక్ తగిలింది. అక్కడ మిడ్ నైట్ షోస్, తెల్లవారుఝాము షోస్ వెయ్యడానికి అనుమతి లేదు అంటూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేసారు. 

బెంగుళూరులో ఉదయం 6గంటలకు ముందు షోస్ వెయ్యడం చట్టవిరుద్ధమని, కర్ణాటక ఫిలిం ప్రొడ్యూసర్స్ ఫిర్యాదుతో కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దానితో బెంగుళూర్ పుష్ప 2 ప్రీమియర్స్ కోసం వెయిట్ చేస్తున్న బన్నీ అభిమానులకు డిజప్పాయింట్ ఎదురైంది. 

Pushpa 2 midnight show cancel:

Pushpa 2 - Midnight shows cancelled in Bengaluru

Tags:   PUSHPA 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ