నాగ చైతన్య-శోభిత దూళిపాళ్ల ఎక్కడ కలిశారు, ఎలా ప్రేమించుకున్నారు, అసలెలా పరిచయమైంది అంటూ నిన్నటివరకు ఎడ తెగని సస్పెన్స్ నడిచింది. దానిని అటు చైతు-ఇటు శోభితలు క్లియర్ చేసారు. చైతు-శోభితలు ముంబైలో జరిగిన అమెజాన్ ప్రైమ్ ఓటీటీ కార్యక్రమంలో పరిచయమయ్యారు, అది ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది.
అయితే చైతు-శోభితలు ఇద్దరూ కలిసి లండన్ రెస్టారెంట్ లో కలిసి డేటింగ్ చేస్తూ దొరికారు, అప్పట్లో ఆ పిక్స్ వైరల్ అయ్యాయి. ఆ తర్వాత నాగ చైతన్య-శోభితలు ఎంగేజ్మెంట్ చేసుకుని ఆ పిక్స్ ని షేర్ చేసారు కానీ.. అసలు వీరిద్దరూ కలిసి డేటింగ్ లో ఉన్న ఒక్క ఫోటో కూడా బయటికి రాలేదు.
తాజాగా మరికొద్ది గంటల్లో నాగ చైతన్య-శోభితలు పెళ్లి పీటలేక్కబోతున్న సమయంలో చైతన్య-శోభితలు ప్రేమలో ఉన్నప్పుడు పిక్స్ బయటికొచ్చాయి. అమెజాన్ ప్రైమ్ కోసం రానా చేస్తున్న టాక్ షోకి చైతు గెస్ట్ గా రాగా.. అందులో పర్సనల్ లైఫ్ గురించి అడగగా.. చైతు మాట్లాడుతున్నప్పడు వెనుకాల డిశ్ ప్లే లో చైతు-శోభితలు డేటింగ్ లో ఉన్న ఫొటోస్ బయట పెట్టారు.
అందులో చైతూ ఒక పిక్ లో శోభిత హ్యాండ్ బ్యాగ్ మోస్తూ కనిపించగా.. మరో పీక్ లో చైతు-శోభితలు స్టయిల్ గా కనిపించారు. పెళ్లికి ముందు బయటికొచ్చిన ఈ పిక్స్ ఇపుడు నెట్టింట్లో సంచలనంగా మారాయి.