మొన్నామధ్యన అంటే 2024 ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం వెళ్లకుండా నంద్యాల వెళ్లి ఆయన స్నేహితుడు వైసీపి అభ్యర్థి అయిన శిల్ప రవిని సపోర్ట్ చేయడంపై మెగా ఫ్యామిలిలో విభేదాలు భగ్గుమన్నాయంటూ మీడియా లో పెద్ద ఎత్తున వార్తలొచ్చేశాయి. మెగా ఫ్యామిలిలో ముఖ్యంగా నాగబాబు అల్లు అర్జున్ విషయంల కోపంగా ఉన్నారు, సాయి ధరమ్ తేజ అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహారెడ్డిలను సోషల్ మీడియా అన్ ఫాలో కొట్టారంటూ ఏవేవో వార్తలు చూసాం..
తాజాగా పుష్ప 2 విడుదలవుతున్న సందర్భంగా కొంతమంది జనసేన నేతలు అల్లు అర్జున్ నువ్వు మెగా ఫ్యామిలీకి క్షమాపణ చెప్పాలి లేదంటే పుష్ప 2 ని అడ్డుకుని తీరుతామంటూ మీడియా ముందు స్టేట్మెంట్స్ ఇస్తునారు.
మరోపక్క మెగా హీరో సాయి ధరమ్ తేజ Wishing all the best to the entire team of #Pushpa2TheRule. Sending my heartfelt and blockbuster wishes to @alluarjun అంటూ అల్లు అర్జున్ కు, పుష్ప టీం కి ఆల్ ద బెస్ట్ చెప్పాడు.
దానికి అల్లు అర్జున్ రియాక్ట్ అవుతూ Thank you very much Teju . Thank you for your brotherly wishes 🖤 . I hope you all like the movie . Hugs ! అంటూ ఇచ్చిన రిప్లై వైరల్ అవగా.. వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు, అసలు మెగా హీరోలకు అల్లు అర్జున్ విషయంలో లేని బాధ మీకెందుకు జనసైనిక్స్ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.