దర్శకుడు వసిష్ఠ తో విశ్వంభర మూవీ ని పూర్తి చేసే లోపులో మెగాస్టార్ తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేసేసారు. గత కొన్ని రోజులుగా చిరు నెక్స్ట్ ప్రాజెక్ట్ పై విపరీతమైన క్యూరియాసిటీ నడుస్తుంది. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తో మెగాస్టార్ కమిట్ అయ్యారనే వార్తలను నిజం చేస్తూ నేడు ఈప్రాజెక్టు పై అధికారిక ప్రకటన ఇచ్చారు.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరు చిత్రానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేస్తూ.. అతను తన ప్రశాంతతను వైలెన్స్ లో వెతుక్కుంటాడు అని కొటేషన్ రాసారు. ఆ పోస్టర్ లో రక్తం కారుతున్న మెగాస్టార్ చెయ్యి ఉంది.
అంతేకాదు చిరంజీవి కెరీర్లోనే మోస్ట్ వైలెంట్ ఫిలిం అని అనౌన్స్ చేసారు. ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న హీరో నాని నేను ఆయన్ని చూస్తూ పెరిగాను. అయన సినిమా టికెట్స్ కోసం లైన్లో నిల్చున్నాను. ఆయన కోసం నా సైకిల్ పోగొట్టుకున్నాను. ఆయన్ని సెలబ్రేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయన సినిమాని ప్రజెంట్ చేస్తున్నాను. ఇది అంతా ఒక సర్కిల్ లాంటిది. మనందరం ఎదురుచూస్తున్న మెగాస్టార్ మ్యాడ్ నెస్ రాబోతుంది. దీని గురించి కలగన్న శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో అంటూ పోస్ట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు.
ఇక శ్రీకాంత్ ఓదెల ఇంకాస్త ఎగ్జైట్ అవుతూ ఫ్యాన్ బాయ్ తాండవం ఎలా ఉంటుందో చూపిస్తాను ప్రామిస్ అంటూ పోస్ట్ చేసాడు.