Advertisementt

రిషబ్ శెట్టి లైనప్ అదుర్స్ గురూ..

Tue 03rd Dec 2024 07:15 PM
rishab shetty  రిషబ్ శెట్టి లైనప్ అదుర్స్ గురూ..
Rishab Shetty Takes on Shivaji Maharaj Role రిషబ్ శెట్టి లైనప్ అదుర్స్ గురూ..
Advertisement
Ads by CJ

కాంతార తో బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ కొట్టిన రిషబ్ శెట్టి ఇప్పుడు సూపర్ లైనప్ తో కెరీర్ సెట్ చేసుకుంటున్నారు. కాంతార ప్రీక్వెల్ అంటూ కాంతార చాప్టర్ 1 తో పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకు వస్తోన్న రిషబ్ శెట్టి టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తో జై హనుమాన్ ఒప్పుకుని సర్ ప్రైజ్ ఇచ్చారు. హనుమంతుడిగా రిషబ్ శెట్టి లుక్ పాన్ ఇండియా ప్రేక్షకులను తెగ ఇంప్రెస్స్ చేసింది. 

ఇప్పుడు రిషబ్ శెట్టి మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసారు. సందీప్ సింగ్ దర్శకత్వంలో ది ప్రైడ్ అఫ్ భారత్ : ఛత్రపతి శివాజీ మహారాజ్ లో వీరశివాజీగా రిషబ్ శెట్టి లుక్ తెగ వైరల్ అవుతుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫస్ట్ లుక్ తోనే సినిమా విడుదల తేదీని ప్రకటించేసారు మేకర్స్. 2027 జనవరి 21 ఛత్రపతి శివాజీ మహారాజ్ విడుదల తేదీని ప్రకటించారు.

ఆచితూచి అడుగులు వేస్తూ కెరీర్ ప్లాన్ చేసుకుంటున్న రిషబ్ శెట్టి ఒప్పుకుంటున్న ప్రాజెక్ట్స్ చూస్తే.. అన్ని పాన్ ఇండియా లో క్రేజీ ప్రాజెక్ట్స్ కావడం విశేషం. ఆయన అభిమానులే కాదు, ఆయన లైనప్ చూసి పాన్ ఇండియా ప్రేక్షకులు కూడా చాలా సర్ ప్రైజ్ అవుతున్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రతి ఏడాది ఓ మూవీ విడుదలయ్యేలా రిషబ్ శెట్టి ప్లాన్ చేసుకోవడం సూపర్ కదా.!

Rishab Shetty Takes on Shivaji Maharaj Role:

Rishab Shetty First Look as Chhatrapati Shivaji Maharaj Unveiled

Tags:   RISHAB SHETTY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ