Advertisementt

పంపించెయ్యండి బిగ్ బాస్ అంటూ ఏడుస్తున్న శోభా

Tue 03rd Dec 2024 04:09 PM
shobha shetty  పంపించెయ్యండి బిగ్ బాస్ అంటూ ఏడుస్తున్న శోభా
Shobha Shetty cries in Bigg Boss పంపించెయ్యండి బిగ్ బాస్ అంటూ ఏడుస్తున్న శోభా
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ గత సీజన్ చూసిన వారెవ్వరూ శోభా శెట్టిని ఇప్పుడప్పుడే అయితే మర్చిపోలేరు, కార్తీక దీపం సీరియల్ లో మోనితగా తెలుగు ప్రేక్షకుల మదిలో విలన్ గా ముద్ర వేసుకున్న శోభా శెట్టి బిగ్ బాస్ 7 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి టాస్క్ ల కన్నా ఎక్కువగా నోరుతోనే హైలెట్ అయ్యింది. అరుంధతి మాదిరి అరుస్తూ మోనార్క్ లా ప్రవర్తించింది.

టాప్ 5 వరకు వెళుతుంది అనుకున్న శోభా శెట్టి ని బుల్లితెర ప్రేక్షకులు భరించలేక చివరి వారంలో ఎలిమినేట్ చేసారు. శోభా శెట్టి, ప్రియాంక కలిసి అరుస్తూ మిగతా హౌస్ మేట్స్ తో గొడవ పడేవారు. అంతలా శోభా శెట్టి బిగ్ బాస్ సీజన్ 7లో చిరాకు పెట్టింది. ఇక్కడే కాదు కన్నడ బిగ్ బాస్ లోను ఈఏడాది వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది శోభా శెట్టి.

తెలుగు బిగ్ బాస్ లో ఎలా అయితే నోరేసుకుని పడిపోతూ ప్రవర్తించిందో.. అంతకు మించి కన్నడ బిగ్ బాస్ లో శోభా శెట్టి ప్రవర్తన ఉంది. శోభా శెట్టి కన్నడ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పై కూడా నోరు పారేసుకుంటూ అరుస్తూ హైలెట్ అవుదామని చూస్తుంది. ప్రస్తుతం కన్నడ బిగ్ బాస్ ప్రోమోస్ లో శోభా శెట్టి అరుపులే కనబడుతున్నాయి.

అంతేకాదు ప్లీజ్ బిగ్ బాస్ నేను ఉండలేను,నన్ను ఎలిమినేట్ చెయ్యండి బిగ్ బాస్ అంటూ ఏడుస్తుంది శోభా శెట్టి, అది చూసి అందరూ షాకవుతున్నారు. తెలుగులోనే కాదు కన్నడలోను తీరు మార్చుకొని శోభా శెట్టి అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.  

Shobha Shetty cries in Bigg Boss:

  Shobha Shetty cries and saying eliminate me Bigg Boss

Tags:   SHOBHA SHETTY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ