Advertisementt

పుష్ప 2 కి ఫహద్ ఫాసిల్ లోటు కనిపిస్తుంది.

Tue 03rd Dec 2024 12:59 PM
fahadh faasil  పుష్ప 2 కి ఫహద్ ఫాసిల్ లోటు కనిపిస్తుంది.
Fahadh Faasil avoids Pushpa 2 promotions పుష్ప 2 కి ఫహద్ ఫాసిల్ లోటు కనిపిస్తుంది.
Advertisement
Ads by CJ

పుష్ప ద రూల్ మ్యానియా తో ఇండియా మొత్తమూగిపోతుంది. నార్త్ ఆడియన్స్ పుష్ప కోసం వెయిటింగ్. బుక్ మై షో లో పుష్ప టికెట్ లు తెగుతుంటే రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. మరోపక్క ప్రమోషన్స్ తో అల్లు అర్జున్ అల్లాడిస్తున్నారు. అంతా ఓకె, అన్ని బావున్నాయి కానీ ఈ చిత్రంలో అల్లు అర్జున్ తో సమానమైన కీలక పాత్ర పోషించిన ఫహద్ ఫాసిల్ ఎక్కడ. 

ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న అదే. అసలు ఫహద్ ఫాసిల్ ఎందుకు పుష్ప 2 ప్రమోషన్స్ అవాయిడ్ చేసారు. కనీసం కేరళ కోచి లో పుష్ప ద రూల్ ఈవెంట్ కు కూడా ఫహద్ ఫాసిల్ హాజరవ్వకపోవడం అల్లు ఫ్యాన్స్ కి షాకవ్వగా నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేసేలా చేసింది. ఫహద్ ఎందుకు పుష్ప 2ని పట్టించుకోలేదు. 

పుష్ప 2 లో చిన్న చితక పాత్ర కాదు చాలా కీలకమైన విలన్ పాత్ర. అలాంటి నటుడు ప్రమోషన్స్ లో కనిపించకపోవడం నిజంగా లోటుగానే కనిపిస్తుంది. కనీసం నిన్న హైదరాబాద్ ఈవెంట్ లో అయినా ఫహద్ ఫాసిల్ కనిపిస్తే బావుండేది, సినిమాకి మరింత అదనపు ఆకర్షణ అయ్యేది అంటూ మూవీ లవర్స్ మాట్లాడుకుంటున్నారు. 

Fahadh Faasil avoids Pushpa 2 promotions:

Pushpa 2 villain Fahadh Faasil avoids promotions

Tags:   FAHADH FAASIL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ