సోలో గా పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొట్టాలంటే గట్స్ ఉండాలి. పుష్ప పార్ట్ 1 అప్పుడే అల్లు అర్జున్ సోలో గా పుష్ప ప్రమోషన్స్ భుజాల మీద మోశాడు. ఎక్కడా ఏ స్టార్ హీరో హెల్ప్ తీసుకోలేదు. చెన్నై, ముంబై, బెంగుళూరు ఏ ఈవెంట్ కి కూడా ఏ భాష హీరోలని పిలవలేదు, ఇప్పుడు కూడా అల్లు అర్జున్ సోలో బ్యాటింగ్ చేస్తున్నాడు.
పాట్నా ఈవెంట్ దగ్గర నుంచి పుష్ప ద రూల్ ప్రమోషన్స్ కోసం ఏ స్టార్ హీరో ని గెస్ట్ గా పిలవలేదు. నిర్మాతలు హీరోయిన్ తో కలిసి అల్లు అర్జున్ ఒక్కడే సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. ప్రస్తుతం పుష్ప ద రూల్ పై చాలా హైప్ ఉంది. దానితోనే హిట్ కొట్టాలని అల్లు అర్జున్ చూస్తున్నాడు, ఇంకా ఇంకా హై తెచ్చేందుకు ఎవ్వరి సపోర్టు అల్లు అర్జున్ తీసుకోవడం లేదు.
సుకుమార్ లేకుండానే పుష్ప ద రూల్ ప్రమోషన్స్ ని అల్లు అర్జున్ సోలో గా సక్సెస్ చేసుకుంటూ వస్తున్నాడు. నిన్న జరిగిన ఈవెంట్ కి కూడా అల్లు అర్జున్ హైలెట్ అయ్యాడు కానీ మెగా కాంపౌండ్ హీరోలని ఎవరిని పిలవలేదు. రాజమౌళి మాత్రం స్పెషల్ గెస్ట్ గా వచ్చి పుష్పరాజ్ కి హై రేంజ్ ఎలివేషన్ ఇచ్చారు.
నిర్మాతలతో కలిసి పక్కా ప్లానింగ్ తో పుష్ప ద రూల్ ఈవెంట్ లో అల్లు అర్జున్ సినిమాని ప్రమోట్ చేస్తూ హైలెట్ అయ్యాడు. అది చూసిన వారు అల్లు అర్జున్ ది కాన్ఫిడెన్సా.. ఓవర్ కాన్ఫిడెన్సా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.