శ్రీలీల అంటేనే డాన్సింగ్ క్వీన్. ధమాకా దగ్గర నుంచి నిన్నమొన్నటి పుష్ప 2 కిస్సిక్ సాంగ్ వరకు శ్రీలీల స్టెప్స్ వేస్తే సెట్ లో దుమ్మురేగాల్సిందే. అయితే పుష్ప ద రూల్ స్పెషల్ సాంగ్ వరకు ఒక ఎత్తు, కిస్సింగ్ సాంగ్ ఒక ఎత్తు అన్నట్టుగా శ్రీలీల సోషల్ మీడియాలో తెగ హైలెట్ అవుతుంది.
చెన్నైలో కిస్సింగ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో స్టేజ్ పై అద్భుతంగా నాట్యమాడిన శ్రీలీల హైదరాబాద్ యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను దుమ్ముదులిపే స్టెప్స్ తో అద్దరగొట్టేసింది. స్ప్రింగ్ లా డాన్స్ చేసే శ్రీలీల ఇప్పుడు రష్మిక తో కలిసి గ్లామర్ పోటీకి సిద్ధమైంది.
చీర కట్టులోనే అందాలను ఎంతగా ఎక్స్ పోజ్ చెయ్యొచ్చో అంతగా శ్రీలీల అందాలు హైలెట్ అయ్యేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. శ్రీవల్లి రష్మిక చీరకట్టు vs శ్రీలీల చీరకట్టు అన్న రేంజ్ లో రశ్మికకు పోటీ ఇస్తుంది. గత రాత్రి శ్రీలీల పుష్ప 2 ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.