పుష్ప 2 ప్రమోషన్స్ లో కనిపించని దర్శకుడు సుకుమార్ ఫైనల్ గా హైదరాబాద్ పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించారు. ఆయన ఫేస్ చూస్తే చాలారోజులు నిద్రపోకుండా డే అండ్ నైట్ వర్క్ చేసినట్టుగా అలిసిపోయింది. అంత టైడ్ గా సుక్కు కనిపించారు. ఆయన స్టేజ్ పైకి రాకముందు సుకుమార్ జర్నీ ప్లే చెయ్యగా సుకుమార్ జర్నీ చూస్తూ ఆయన భార్య తబిత కనిళ్ళు పెట్టుకున్నారు.
స్టేజ్ పైకి వచ్చి సుకుమార్ మాట్లాడలేను అంటూనే అల్లు అర్జున్ కష్టం గురించి ఆయన ఎదిగిన విధానం గురించి మాట్లాడుతూ ఈ సినిమా నీ దగ్గరకు వచ్చినప్పుడు కథ లేదు, నీపై ప్రేమతోనే ఈ సినిమా చేశాను అంటూ మాట్లాడుతుండగా.. అల్లు అర్జున్ కంటతడి పెట్టుకోవడం అభిమానుల మనసు కలిచివేసింది. సుకుమార్ అల్లు అర్జున్ గురించి మాట్లాడుతుండగా అల్లు అర్జున్ ఎమోషనల్ అయిన వీడియోస్ వైరల్ అయ్యాయి.
ఇక పుష్ప 3 ఉంటుంది, మీ హీరో మరో మూడేళ్లు నాకిస్తే పుష్ప 3 ఉంటుంది. మీ హీరో రెడీ అయితే నేను రెడీ అంటూ సుకుమార్ పుష్ప 3 గురించి క్లారిటీ ఇచ్చేసారు.
సుకుమార్ మాట్లాడను అంటూనే పేరు పేరునా అందరి గురించి మట్లాడేసారు. ఇక అల్లు అర్జున్ స్టేజ్ పైకి వచ్చాక అందరికి పేరు పేరునా థాంక్స్ చెప్పారు, అందరికి థాంక్స్ చెప్పడం తప్ప ఈరోజు తానేమి చెయ్యలేను అంటూ అల్లు అర్జున్ మాట్లాడడం అభిమానులను ఇంప్రెస్స్ చేసింది.