పుష్ప ద రూల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో అంగరంగ వైభావంగా జరుగుతుంది. రాజమౌళి గెస్ట్ గా వచ్చిన ఈ ఈవెంట్ లో దర్శకుడు సుకుమార్ కూడా దర్శనమిచ్చారు. ఇప్పటివరకు పుష్ప ప్రమోషన్స్ లో కనిపించని సుకుమార్ ఫస్ట్ టైం పుష్ప 2 ఈవెంట్ లో కనిపించడంతో ఆయన అభిమానులు ఫుల్ హ్యాపీ.
ఇక గెస్ట్ గా వచ్చిన రాజమౌళి పుష్ప రాజ్ ని ఓ రేంజ్ లో హై ఇచ్చి వదిలారు. ఎవరైనా గెస్ట్ గా వచ్చి సినిమా గురించి మాట్లాడితే ఆ సినిమాకి హెల్ప్ అవుతుంది, హీరోకి హెల్ప్ అవుతుంది, అదే టెక్నీషియన్స్ గురించి మాట్లాడితే వాళ్లకు హెల్ప్ అవుతుంది అని మాట్లాడాలి కానీ పుష్ప రాజ్ కి అదేమీ అక్కర్లేదు, మూడేళ్ళ క్రితమే చెప్పాను నార్త్ పై గట్టిగా ఫోకస్ పెట్టు బన్నీ అని, పుష్ప 2 కి అసలు ప్రమోషన్స్ అక్కర్లేదు, ఈవెంట్స్ అక్కర్లేదు, ఆ రేంజ్ లో పుష్పా టికెట్స్ తెగుతాయి.
నేను రామోజీ ఫిలిం సిటీలో పుష్ప 2 షూటింగ్ జరుగుతున్నప్పుడు వెళ్ళాను, అక్కడ సుకుమార్, బన్నీ ఉన్నారు. నాకు ఒక సీన్ చూపిస్తాను అంటే సరే అన్నాను, నేను ఆ సీన్ చూస్తుంటే బన్నీ, సుక్కు మాట్లాడుకుంటున్నారు. నాకు ఎవరైనా సీన్స్ చూపిస్తే దాని గురించి ఏం చెప్పాలో తెలియదు అని వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఆ సీన్ పుష్ప రాజ్ ఇంట్రడక్షన్ సీన్. ఆ సీన్ కి దేవిశ్రీ మ్యూజిక్ ఎంతిస్తాడో అంత తీసుకోమని చెప్పాను,
ఆ సీన్ చూసాక సినిమా ఎలా ఉంటుందో అర్ధమైపోతుంది. టీమ్ కి ఆల్ ద బెస్ట్ అని కూడా చెప్పాలనిపించడం లేదు అంటూ పాన్ ఇండియా దర్శకుడు రాజమౌళి పుష్ప రాజ్ ని ఓ రేంజ్ లో పొగిడేశారు.