Advertisementt

పెళ్లి కూతురుగా ముస్తాబైన శోభిత దూళిపాళ్ల

Mon 02nd Dec 2024 07:40 PM
sobhita dhulipala  పెళ్లి కూతురుగా ముస్తాబైన శోభిత దూళిపాళ్ల
Sobhita Dhulipala Radiant Glow As A Bride పెళ్లి కూతురుగా ముస్తాబైన శోభిత దూళిపాళ్ల
Advertisement
Ads by CJ

మరికొన్ని గంటల్లో దూళిపాళ్ల నుంచి అక్కినేని గా మారబోతున్న శోభిత ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రెండు రోజులుగా శోభిత దూళిపాళ్ల, నాగ చైతన్య ల హల్దీ సెర్మొనీ, మంగళ స్నానాలు, పెళ్లి కూతురుగా శోభితను ఆమె ఫ్యామిలీ మెంబెర్స్ తయారు చేస్తున్న పిక్స్ అన్ని అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇస్తున్నాయి. 

శోభిత సిస్టర్ సమంత శోభిత మంగళ స్నానాల దగ్గర నుంచి పెళ్లి కూతురుగా శోభితను ముస్తాబు చేసేవరకు సందడి అంతా ఆమెదే కనిపిస్తుంది. తాజాగా శోభిత పెళ్లి కుమార్తెగా మారిన ఫొటోస్ నెట్టింట్లో సంచలనంగా మారాయి. రెడ్ శారీలో శోభితకు చీర పెట్టే దగ్గర నుంచి గాజులు తొడిగేవరకు, అలాగే నుదుటున కల్యాణ తిలకం ఇలా శోభిత పెళ్లి కూతురుగా చాలా సాంప్రదాయంగా కనిపించింది. 

శోభిత అలాగే ఆమె ఫ్యామిలీ మెంబెర్స్ అంతా ఫోటోలకు ఫోజులిస్తూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం శోభిత పెళ్లి కూతురు ఫొటోస్ వైరల్ గా మారగా మరికొద్ది గంటల్లో చైతూ కి భార్యగా, నాగార్జునకు కోడలుగా అక్కినేని ఇంట కాలు పెట్టబోతోంది ఆమె. 

Sobhita Dhulipala Radiant Glow As A Bride:

Sobhita Dhulipala is all set to be a beautiful bride rooted in traditions

Tags:   SOBHITA DHULIPALA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ