Advertisementt

పుష్ప 2 పై క్రేజ్ ని తగ్గించే నెగిటివిటి

Mon 02nd Dec 2024 04:17 PM
pushpa 2  పుష్ప 2 పై క్రేజ్ ని తగ్గించే నెగిటివిటి
Pushpa 2 is the negativity that reduces the craze పుష్ప 2 పై క్రేజ్ ని తగ్గించే నెగిటివిటి
Advertisement
Ads by CJ

పుష్ప 2 ద రూల్ పై ప్రస్తుతం ప్రేక్షకుల్లో ట్రేడ్ లో విపరీతమైన అంచనాలున్నాయి. పుష్ప 2 కంటెంట్ పరంగానే కాదు, సాంగ్స్ పరంగాను, అలాగే ప్రమోషన్స్ పరంగాను విపరీతమైన హై ఉన్న పుష్ప 2 పై ఇప్పుడు నెగిటివిటి మొదలయ్యింది. కారణం పుష్ప ద రూల్ కి పెరిగిన టికెట్ రేట్స్. తెలంగాణాలో ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పుష్ప 2 కి టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతి ఇచ్చేసింది. 

ఇక ఏపీ ప్రభుత్వం పుష్ప 2 కి ఎంత హైక్ ఇస్తుందో తెలియదు. పుష్ప 2 సినిమా చూడాలంటే మాములు విషయం కాదు, ఓ రేంజ్ లో జేబుకి చిల్లు పడుతుంది. మిడిల్ క్లాస్ కానీ, ఫ్యామిలీ ఆడియన్స్ కానీ పుష్ప 2 మూవీ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఫ్యాన్స్, మాస్ ఆడియన్స్ మాత్రం ఒక్కరోజు సంపాదన పోతేపోయింది, పుష్ప 2 చూడాల్సిందే అంటున్నారు. 

కానీ చాలామంది పుష్ప 2 కి పెరిగిన టికెట్ రేట్స్ పై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎవరు భారీ బడ్జెట్ పెట్టామన్నారు, బడ్జెట్ పెట్టారు, దానిని పూడ్చుకోవడానికి టికెట్ రేట్లు పెంచేసి మా మీద రుద్దుతారా, ఇది పద్ధతేనా పుష్ప మేకర్స్ కు అంటూ కామన్ ఆడియన్స్ మాట్లాడుతున్న మాటలు. ఆ రకంగా పుష్ప ద రూల్ పై నెగిటివిటి మొదలైనట్టేగా. 

Pushpa 2 is the negativity that reduces the craze:

Pushpa 2 Ticket Price Hike

Tags:   PUSHPA 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ