బిగ్ బాస్ సీజన్ 8 లో లాస్ట్ రెండు వారాల ఆట మిగిలి ఉంది. ఈ రెండు వారాల్లో టాస్క్ లు ఏమి ఉండవు, పార్టీలని, సరదాగా ఆడుకోవడం తప్ప ఇకపై బిగ్ బాస్ కి కంటెంట్ ఏమి ఉండదు కాబట్టే రాత్రి 9.30 ప్రసారమవ్వాల్సిన బిగ్ బాస్ స్టార్ మా లో ఈరోజు నుంచి 10 గంటలకు షిఫ్ట్ చేసారు. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ వారం డబుల్ ఎలిమిషన్ లో టేస్టీ తేజ, పృథ్వీ ఎలిమినేట్ అయ్యారు.
ఇంకా హౌస్ లో నిఖిల్, గౌతమ్, నబీల్, ప్రేరణ, అవినాష్, రోహిణి, విష్ణు ప్రియా ఉన్నారు. ఈ వారమొకరు ఎలిమినేట్ అయితే ఇంకా ఆరుగురు టాప్5 వరకు ఉంటారు. ఈలోపే మరో ఎలిమినేష ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ లో చివరి నామినేషన్స్ లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి బిగ్ షాక్ ఇచ్చాడు.
ఈ వారం నామినేషన్స్ లో ఆడియన్స్ నిర్ణయం ప్రకారమే ఉంటుంది అంటూ బిగ్ బాంబు పేల్చాడు. టికెట్ టు ఫినాలే గెలిచి నేరుగా టాప్ 5 లోకి అడుగుపెట్టిన అవినాష్ తప్ప మిగతా వారంతా నామినేషన్స్ లోకి వెళ్లారంటూ బిగ్ బాస్ ప్రకటించాడు. నిఖిల్, గౌతమ్, నబీల్, ప్రేరణ, విష్ణు ప్రియా, రోహిణి అంతా ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చారు. మరి ఫైనల్ గా ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.