పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రసుతం ఫుల్ స్పీడులో సినిమాలు పూర్తి చేస్తున్నారు. గత ఎడాది ఆదిపురుష్, సలార్ 1 తోప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఈఏడాది కల్కి 1తో దున్నేసారు. వచ్చే ఏడాది ముందుగా ప్రభాస్ మారుతి దర్శకత్వంలో చేస్తున్న రాజా సాబ్ చిత్రాన్ని విడుదలకు రెడీ చేస్తున్నారు.
ప్రస్తుతం రాజా సాబ్ సాంగ్ షూట్ కోసం హీరోయిన్ మాళవిక మోహనన్ తో కలిసి యూరప్ వెళ్లోచ్చిన ప్రభాస్ అతి త్వరలోనే స్పిరిట్ సెట్స్ లోకి వెళ్లనున్నారు. తాజాగా రాజా సాబ్ షూటింగ్ పై మాళవిక మోహనన్ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చింది. రాజా సాబ్ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది అంటూ ఆమె ఒక చిట్‌చాట్‌లో చెప్పుకొచ్చింది.
రాజా సాబ్ లోని తన పార్ట్ షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి అయ్యిందని, మిగతా షూటింగ్ త్వరలోనే పూర్తి అవుతుంది, దర్శకుడు మారుతి రాజా సాబ్ ను అనుకున్న సమయానికి పూర్తి చేసే విధంగా ఒక్క రోజు కూడా టైమ్ వేస్ట్ చెయ్యకుండా షూటింగ్ చేస్తున్నారు. రాజా సాబ్ సినిమా షూటింగ్ మొత్తం చాలా సరదాగా సాగుతుంది అంటూ మాళవిక మోహనన్ రాజా సాబ్ షూటింగ్ పై క్రేజీ అప్ డేట్ ఇచ్చింది.