చాలామంది హీరోలు నటనను జీవితాంతం కొనసాగించాలనుకుంటారు, తమకు ఫేమ్ కావాలని, అభిమానులని ఎంటర్టైన్ చెయ్యాలనే కోరికతోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు, హీరోయిన్స్ లో కొంతమంది పెళ్లి తర్వాత కమిట్మెంట్ తో నటనకు దూరమైనా, చాలామంది హీరోయిన్స్ పెళ్లి తర్వాత కూడా నటనను కొనసాగిస్తున్నారు. కానీ ఇప్పుడొక స్టార్ యాక్టర్ నటనకు ఎండ్ కార్డు వేస్తున్నట్టుగా వేసిన ట్వీట్ అభిమానులను కలవరపెడుతుంది.
టెన్త్ ఫెయిల్ చిత్రంతో విశేషమైన గుర్తింపు తెచ్చుకోవడమే కాదు, ఆ చిత్రంతో పలు రివార్డులు, అవార్డులు అందుకున్న విక్రాంత్.. 2025 తరవాత సినిమాలకు వీడ్కోలు చెబుతానంటూ చేసిన ట్వీట్ చేయడం ఆయన అభిమానులతో పాటు, బాలీవుడ్ కూ షాక్ ఇచ్చింది. 2013లో లూటేరా సినిమాతో నటుడిగా పరిచయమైన విక్రాంత్ ఏజ్ 37 ఇయర్స్.
ఇంకా ఏంతో కెరీర్ ఉన్న విక్రాంత్ సడన్ గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నాడు అంటే.. తన కుటుంబానికి పూర్తి స్థాయి సమయం కేటాయించాల్సిన అవసరం వచ్చిందని, అందుకే సినిమాలు మానేస్తున్నానని ఆ ట్వీట్ లో రాసుకొచ్చాడు. 2025లో తన నుంచి వచ్చే చిత్రమే తన చివరి చిత్రం అవుతుందని, ఇన్నేళ్ళుగా తనని ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ విక్రాంత్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.