బిగ్ బాస్ సీజన్ 8 హౌస్ లో ప్రేమ జంటగా ప్రొజెక్ట్ అయిన పృథ్వీ రాజ్-విష్ణు ప్రియలను బుల్లితెర ప్రేక్షకులు నిర్ధాక్షిణ్యంగా విడగొట్టారు. విష్ణు ప్రియా లవ్ ట్రాక్ సెట్ చేస్తూ హౌస్ లో కొన్ని వారాలు సర్వైవ్ అయ్యేందుకు పృథ్వీ తో లవ్ ట్రాక్ ని నడిపింది. పృథ్వీ ఆమెను పెద్దగా పట్టించుకోకపోయినా విష్ణు ప్రియా మాత్రం పృథ్వీ చుట్టూ తిరిగి మరీ లవ్ ట్రాక్ పట్టాలెక్కించింది.
ఆ ట్రాక్ వర్కౌట్ అయ్యింది కానీ.. పృథ్వీ సైడ్ నుంచి ఫీలింగ్స్ ఏమి లేకపోయినా విష్ణు ప్రియా గేమ్ ఎఫెక్ట్ అయ్యింది, ఆమె ఎక్కువగా పృథ్వీతో ఉండేందుకు చూపించిన ఇంట్రెస్ట్ గేమ్ పై పెట్టకపోవడంతో ఆమె అభిమానుల నుంచే విష్ణు ప్రియపై నెగిటివిటి మొదలైంది. విష్ణు ప్రియా నామినేషన్స్ కి వచ్చినా ఆమెకి అభిమానులే పెద్దగా ఓట్లు వెయ్యడం లేదు.
గత రెండు వారాలుగా ఎలిమినేషన్ తప్పించుకుంటున్న విష్ణు ప్రియా ఈ వారం కూడా తప్పించుకుంది. టేస్టీ తేజ కాకుండా పృథ్వీ తో పాటుగా విష్ణు ప్రియను కూడా ఎలిమినేట్ చెయ్యాల్సింది బిగ్ బాస్ అంటూ చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ చేసారు. కానీ తేజ తో పాటుగా పృథ్విని ఎలిమినేట్ అయ్యేలా చేసి బుల్లితెర ప్రేక్షకులు విష్ణు ని పృథ్విని వేరు చేసారు. పాపం లవ్ బర్డ్స్ అలా విడిపోయారు.