అక్కినేని ఇంటికి కోడలిగా అడుగుపెట్టబోతున్న శోభిత దూళిపాళ్ల పై మరో అక్కినేని కోడలు అమల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. రెండు రోజుల్లో నాగ చైతన్య తో పెళ్లి పీటలెక్కి ఏడడుగులు నడవబోతున్న శోభిత దూళిపాళ్ళ ప్రస్తుతం పెళ్లి వేడుకలను ఆస్వాదిస్తోంది.పెళ్లి కూతురుగా శోభిత, పెళ్లి కొడుకుగా చైతు మంగళ స్నానాలు, పెద్దల ఆశీర్వాదాలతో కొత్త జంట మురిసిపోతుండగా.. ప్రస్తుతం అక్కినేని కుటుంబం అంతా సందడిగా మారిపోయింది.
తాజాగా అమలను కొత్త కోడలు శోభిత దూళిపాళ్ళకు ఏమైనా సలహాలు ఇస్తారా అని అడిగితే.. ఆమె చాలా టాలెంటెడ్.. ఎంతో మెచ్యూరిటీ ఉన్న అమ్మాయి. అలాంటి అమ్మాయికి నేను సలహాలు అంటూ ప్రత్యేకంగా ఏమి ఇవ్వక్కర్లేదు. శోభిత తప్పకుండా ఒక మంచి భార్యగా లైఫ్ ని లీడ్ చెయ్యాలని, తన వైవాహిక జీవితాన్ని ఆస్వాదించాలని నా కోరిక అంటూ అమల శోభితపై చేసిన కామెంట్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇక తన లైఫ్ లో తాను పోషించిన ప్రతి పాత్ర తనని ఇంత దూరం తీసుకొచ్చాయని, భార్యగా, తల్లిగా, కోడలిగా అన్ని తనకు ముఖ్యమైన పాత్రలే, అవే తనని ఇప్పటివరకు నడిపించాయంటూ అమల చెప్పుకొచ్చింది.