కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ చిత్రం కంగువ. నవంబర్ 10 న భారీ బడ్జెట్ తో భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కంగువ చిత్రం ఆడియన్స్ ను డిజప్పాయింట్ చేసింది. పాన్ ఇండియా ప్రేక్షకులని కాదు తమిళ ఆడియన్స్ ను కూడా కంగువ ఇంప్రెస్స్ చెయ్యలేకపోయింది.
సూర్య కష్టానికి తగిన ప్రతిఫలం కంగువ ఇవ్వలేకపోయింది. దర్శకుడు శివ మేకింగ్, అలాగే దేవిశ్రీ మ్యూజిక్ పై బోలెడన్ని విమర్శలొచ్చాయి. అయితే థియేటర్స్ లో కంగువ పెద్దగా ప్రభావం చూపలేకపోయిన కంగువ చిత్రం ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కి రెడీ అవుతుంది. కంగువ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
అమెజాన్ ప్రైమ్ నుంచి కంగువ చిత్రం డిసెంబర్ 12 లేదా 13 నుంచి ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.