నందమూరి వారసుడు బాలయ్య తనయుడు మోక్షజ్ఞ మొదటి సినిమా ఇంకా పట్టాలెక్కలేదు, కేవలం అనౌన్సమెంట్ ఇచ్చారు అంతే.. అప్పుడే మోక్షజ్ఞ రెండో సినిమా లైన్ లోకి వచ్చేసింది. మొదటి సినిమాని హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.. ప్రసుతం మోక్షజ్ఞ డెబ్యూ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఇప్పుడు మోక్షజ్ఞ రెండో సినిమా వార్త నందమూరి అభిమానులను ఎగ్జైట్ చేస్తుంది. నందమూరి మోక్షజ్ఞ తన రెండో సినిమాని లక్కీ భాస్కర్ తో భారీ హిట్ కొట్టిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో నాగవంశీ నిర్మాతగా సితార ఎంటర్టైన్మెంట్ లో చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు చర్చలు కూడా పూర్తయ్యి ఈ చిత్రాన్ని లాక్ చేసినట్లుగా సమాచారం.
ప్రస్తుతం ప్రశాంత్ వర్మ తో చెయ్యబోయే చిత్రం కోసం మోక్షజ్ఞ ఫుల్ గా మేకోవర్ అవుతున్నాడు. రీసెంట్ గా వదిలిన మోక్షజ్ఞ లుక్ కి నందమూరి అభిమానులే కాదు మూవీ లవర్స్ అంతా ఇంప్రెస్స్ అయ్యారు.