అక్టోబర్ లో రకుల్ ప్రీత్ జిమ్ లో గాయపడి వారం రోజుల పాటు మంచానికే పరిమితమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆమె కి అసలు గాయమేలా అయ్యిందో, గాయం వలన తనెంత సఫర్ అవుతుందో తాజాగా బయటపెట్టింది. అక్టోబర్ 5 న నేను జిమ్ లో చాలా బరువైన డెడ్ లిఫ్ట్ ని ఎత్తాను, అప్పుడే నాకు వెన్ను నొప్పి అనిపించింది. అయినప్పటికి వర్కౌట్ పూర్తి చేసి ఇంటికి వెళ్ళాను.
సాయంత్రానికి ముందుకు కూడా వంగలేనంత నొప్పి వచ్చింది. అయినప్పటికీ షూటింగ్ కి వెళ్ళాను. పదో తేదీ నాటికి ఆ నెప్పి బాగా పెరిగింది. నేను నా బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం రెడీ అవుతుండగా నా శరీరం రెండుగా విడిపోయినట్టుగా బాధపెట్టడంతో స్పృహ కోల్పోయాను, ఆ తర్వాత బిపి డౌన్ అయ్యింది.
అప్పుడు బెడ్ మీదకి ఎక్కిన నేను పదిరోజులు నడవలేకపోయాను, రెస్ట్ లో ఉండాల్సి వచ్చింది. జాకీ భగ్నానీ నా కోసం బర్త్ డే పార్టీ అరెంజ్ చేసినా దానికి నేను వెళ్ళలేకపోయాను. నేను కోలుకోవాలడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుంది అని చెప్పారు. నేను ఇప్పటికి 100 శాతం కోలుకోలేదు. గాయమై ఆరో వారంలో ఉన్నాను. ప్రస్తుతం కోలుకుంటున్నాను అంటూ రకుల్ తనకి గాయమైన విషయాన్ని బయటపెట్టింది.