మరో నాలుగు రోజుల్లో థియేటర్లులోకి రాబోతున్న పుష్ప ద రూల్ నుంచి అభిమానులు విజిల్స్ వేసే రేంజ్ లో పుష్ప పీలింగ్స్ అంటూ వదిలిన సాంగ్ లో నిజంగా ఫీలింగ్స్ రావాల్సిందే. ఆ రేంజ్ లో అల్లు అర్జున్ డాన్స్, రష్మిక అందాలు, దేవిశ్రీ మ్యూజిక్ హైలేట్ అయ్యాయి.
ఈ పాటలో వింటేజ్ అల్లు అర్జున్ కనిపించగా.. మలయాళం లిరిక్స్ తో మొదలై ఆ తర్వాత తెలుగు లిరిక్స్ తో పాట మొత్తం సాగుతుంది. అల్లు అర్జున్, రష్మిక మందన్నతో కలిసి ఎంతో ఎనర్జిటిక్ గా వేసిన డాన్స్ స్టెప్పులు ముఖ్యంగా రష్మిక అందాల విందు మాములుగా లేదు, అల్లు అర్జున్, రష్మిక రొమాన్స్ అదిరిపోయింది.
ప్రతి స్టెప్, ప్రతి విజువల్ అన్ని అద్దిరిపోయాయంటూ మూవీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ పాట బిగ్ స్క్రీన్ మీద చూస్తే మాత్రం ఫ్యాన్స్ కి పూనకలొచ్చేస్తాయ్. విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చెయ్యడం గ్యారెంటీ. అమ్మో రష్మిక అందాలు ఆరబోత చూస్తే మతిపోవాల్సిందే అంటూ ఆమె అభిమానులు చేసున్న కామెంట్స్ తో పుష్ప2 పై ఉన్న అంచనాలు పదింతలు పెరిగిపోయాయి.