నందమూరి బాలకృష్ణ-బోయపాటి కాంబో నాలుగోసారి పట్టాలెక్కేందుకు రెడీగా ఉంది. అఖండ తాండవం ఇప్పటికే పూజా కార్యక్రమాలతో మొదలైపోయింది. బోయపాటి ఈసారి బాలయ్యను అఖండలో అఘోరాకు మించి ఎంత పవర్ ఫుల్‌గా చూపిస్తారో అని నందమూరి అభిమానులు క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు.
అయితే అఖండలో విలన్ గా శ్రీకాంత్ ఇంకొంతమందిని దించిన బోయపాటి.. ఈసారి ఓ స్టార్ హీరోని బాలయ్యకు విలన్‌గా దించబోతున్నారట. లెజెండ్ చిత్రంలో జగపతి బాబు లాంటి హీరోని అఖండ తాండవంలో బాలయ్య కోసం బోయపాటి సెట్ చేస్తున్నారట. అఖండ లో బాలయ్య అఘోరి పాత్ర ముందు శ్రీకాంత్ విలన్ గా తేలిపోయాడు అనే విమర్శలొచ్చాయి.
ఈసారి అఖండ తాండవంలో ఆ లోటు లేకుండా బోయపాటి బాలీవుడ్ నుంచి సంజయ్ దత్ తో పాటుగా మరో సౌత్ హీరో ని కూడా ఎంపిక చేస్తున్నారని తెలుస్తోంది. ఇక అఖండ లోని కొని పాత్రలు అఖండ 2 లో కూడా కంటిన్యూ కాబోతున్నాయట. అందులో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ పాత్ర అఖండ తాండవంలో కూడా ఉంటుందట. సో బోయపాటి ఈసారి అఖండ తాండవంతో అభిమానులను తాండవమాడిస్తాడేమో చూద్దాం.