యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం విడుదలకు ముందు, విడుదలయ్యాక కానీ టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎవరూ దేవరను సపోర్ట్ చేస్తూ ఒక్క ట్వీట్ కూడా వెయ్యలేదు. దేవర విడుదలై హిట్ అయ్యాకా కూడా ఎవరూ స్పందించకపోవడం అప్పట్లో ఎన్టీఆర్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఆఖరికి ఎన్టీఆర్‌తో నాలుగు సినిమాలు చేసిన రాజమౌళి కూడా ట్వీట్ వెయ్యకపోయేసరికి మరింతగా డిజప్పాయింట్ అయ్యారు.
అప్పట్లో దేవరకి సపోర్ట్ చెయ్యని టాలీవుడ్ ప్రముఖులు ఇప్పుడు అల్లు అర్జున్ పుష్పకి సపోర్ట్ చేస్తారా, ఆల్ ద బెస్ట్ చెబుతూ ట్వీట్లు వేస్తారా, లేదంటే విడుదలై హిట్ అయ్యాక చూసుకుందాములే అనుకుంటారా? అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. డిసెంబర్ 5న విడుదలకు సిద్ధమవుతున్న పుష్ప 2 పై విపరీతమైన క్రేజ్ ఉంది.
అయితే ఇప్పుడు ఈ చిత్రం విడుదల సందర్భంగా సెలబ్రిటీస్ ఎలా రియాక్ట్ అవుతారా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటే.. అల్లు అభిమానులు ఆత్రంగా కనిపిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో మెగా రచ్చ జరుగుతూనే ఉంది. మెగాభిమానులు ఈ సినిమాను బాయ్‌కాట్ అనేలా కామెంట్స్ చేస్తున్నారు.