నాగ చైతన్య జీవితంలోకి మరో నాలుగు రోజుల్లో పెళ్లితో ప్రవేశించబోతున్న హీరోయిన్ శోభిత దూళిపాళ్ల ప్రస్తుతం వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ ని ఎంజాయ్ చేస్తుంది. తెలుగు వారి పెళ్లి ఇలా వైకుంఠమే మళ్ళీ అన్నట్టుగా నాగ చైతన్య-శోభితల వివాహ వేడుకలు మొదలైనాయి. గత రెండు రోజులుగా చైతు-శోభితల హల్దీ వేడుకలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
నాగ చైతన్య-శోభితలు పెళ్లి కొడుకు-పెళ్లికూతురు గా మెరిసిపోతూ సిగ్గుమొగ్గలవుతున్నారు. సాంప్రదాయ బద్దంగా మొదలైన పెళ్లి వేడుకల్లో శోభిత తల్లి తండ్రులు అన్నీ పద్దతి ప్రకారం నిర్వహిస్తున్నారు. తాజాగా చైతూ తన లైఫ్ లోకి శోభిత ఎలా ప్రవేశించిందో చెప్పాడు. ముంబైలో జరిగిన ఓ ఓటీటీ ఈవెంట్ లో కలిశామని, పరిచయం ప్రేమగా మారి పెళ్ళి చేసుకుంటున్నట్లుగా, శోభితతో పెళ్లి కోసం చాలా ఎదురు చూస్తున్నట్టుగా చెప్పాడు.
ఇక శోభిత తనకు చైతులోని కూల్ నెస్ నచ్చుతుంది, సింపుల్ గా కామ్ గా ఉంటాడు, ఎలాంటి ఆర్భాటాల జోలికి వెళ్ళడు, అందరితో ప్రేమగా, గౌరవంతో ఉంటాడు, అలాగే హుందాగా నడుచుకుంటారు, చైతులోని ఆ లక్షణాలే నన్ను చైతూ ప్రేమలో పడేశాయి అంటూ శోభిత తనకి నాగ చైతన్య లో నచ్చే లక్షణాలు ఏమిటో బయటపెట్టింది.