పుష్ప ద రూల్ భారీ బడ్జెట్ తో భారీగా తెరకెక్కిన చిత్రం, పాన్ ఇండియాలోని పలు భాషల్లో డిసెంబర్ 5 న విడుదలకు సిద్దమవుతుంది. అయితే పుష్ప ద రూల్ టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చేసింది. ప్రీమియర్స్ షోస్ కి సింగిల్ స్క్రీన్స్ - రూ.1121, మల్టీప్లెక్స్ - రూ.1239 పెంచారు. అంతేకాకుండా సినిమా విడుదలైన మొదటి నాలుగు రోజులు సింగిల్ స్క్రీన్స్ - రూ. 354, మల్టీప్లెక్స్ - రూ. 531టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం.
ఇంకా ఆంధ్ర రేట్లు తెగలేదు, దేవర కు ఇచ్చిన టికెట్ హైక్ పుష్ప 2 కి సరిపోదు అని గీత ఆర్ట్స్ నిర్మాత బన్నీ వాస్ ఏపీలోనే ఉండి ప్రభుత్వాన్ని అడుగుతున్నారట. మరి ఇదంతా చూస్తుంటే పుష్ప ద రూల్ కేవలం అభిమానుల కోసమే అన్నట్టుగా ఉంది వ్యవహారం. అభిమానులైతే ఎంతైనా పెట్టుకుని సినిమా చూస్తారు.
కానీ మొదటి నాలుగు రోజులు పుష్ప సినిమా చూడాలంటే ఫ్యామిలీస్ వెనకడుగు వెయ్యాల్సిందే. ఎందుకంటే అంత రేట్లు పెట్టుకుని వెళ్లరు, అందులోను మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే పుష్ప ని వీక్షించాలంటే మినీ బడ్జెట్ పెట్టుకోవాల్సిందే. సో పుష్ప ద రూల్ మొదటి నాలుగు రోజులు కేవలం అభిమానుల కోసమే అనాలేమో..