మహానటి కీర్తి సురేష్ పెళ్ళికి రెడీ అయ్యింది. డిసెంబర్ లో తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోని ని గోవా లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతుంది. ఒకప్పుడు కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్, ఆమె అందాలు చూపించడానికి అస్సలు మొగ్గు చూపలేదు. మహానటి తర్వాత కీర్తి సురేష్ కి వచ్చిన ప్లాప్ లు ఆమె స్టయిల్ ని మార్చేసాయి.
మహేష్ తో చేసిన సర్కారు వారి పాట లో గ్లామర్ గా కనిపించి షాకిచ్చింది. ఆ తర్వాత సోషల్ మీడియాలోనూ అందాల ఆరబోతకు దిగిన కీర్తి సురేష్ ఇప్పుడు వేరే లెవల్ అందాలు చూపించేస్తుంది. బాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యాక సౌత్ హీరోయిన్స్ మారిపోతారు మారిపోతారు అంటారు, అది కీర్తి సురేష్ నిజం చేసింది.
ఆమె నటించిన హిందీ మూవీ డిసెంబర్ లో విడుదలవుతుంది. ఆ చిత్రంలో కీర్తి సురేష్ గ్లామర్ షో మాములుగా లేదు, తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్ చూస్తే గ్లామర్ తో దుమ్ము రేపుతున్న కీర్తి సురేష్ అనాల్సిందే.