బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం డబుల్ ఎమినేషన్ ఉండబోతుంది అని నాగార్జున ముందు చెప్పినట్టుగానే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న టేస్టీ తేజ ముందుగా అంటే శనివారం ఎపిసోడ్ లోనే ఎలిమినేట్ అవ్వగా.. రేపు ఆదివారం ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారో అనే విషయంలో ఓటింగ్ పోల్స్ బట్టి ప్రేక్షకులు ఓ అంచనాకు వచ్చేసారు.
గత కొన్ని వారాలుగా కన్నడ బ్యాచ్ ను స్టార్ మా, బిగ్ బాస్ యాజమాన్యం కాపాడుతుంది అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు. గత వారం కన్నడ బ్యాచ్ నుంచి యష్మి ని ఇంటికి పంపిస్తే ఈ వారం టేస్టీ తేజ తో పాటుగా డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా కన్నడ నటుడు పృథ్విని ఎలిమినేట్ చేసినట్లుగా లీకులు చెబుతున్నాయి.
బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాక నిఖిల్ తో, సోనియాతో ఫ్రెండ్ షిప్ చేసిన పృథ్వికి సోనియా ఎలిమినేట్ అయ్యాక విష్ణు ప్రియతో ఫ్రెండ్ షిప్ చేసాడు. అయితే పృథ్వీ టాస్క్ ల పరంగా ఓకె కానీ.. ఎవరితో ఎలా మాట్లాడాలో, అలాగే మాట్లాడే విధానం తెలియదు, గౌతమ్, అవినాష్, అలాగే గతంలోనూ కొంతమందిపై పృథ్వీ నోరు పారేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి వాళ్ళను ప్రేక్షకులు సపోర్ట్ చేస్తున్నారా అని అవినాష్ కూడా తెగ ఫీలైపోయాడు.
ఫైనల్ గా పృథ్వీ ఈవారం డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా అతి తక్కువ ఓట్లతో ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటికొచ్చేసాడు.