Advertisementt

BB 8లో ఈవారం ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరంటే..

Sat 30th Nov 2024 07:14 PM
tasty teja  BB 8లో ఈవారం ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరంటే..
Bigg Boss 8-Tasty Teja eliminated BB 8లో ఈవారం ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరంటే..
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ హోస్ట్ నాగార్జున వచ్చి రాగానే హౌస్ మేట్స్ గుండెల్లో గుబులు పుట్టించారు. ఈ సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఇచ్చిన వారిలో గౌతమ్ చాలా స్ట్రాంగ్ గా కనిపించగా కమెడియన్స్ గా అవినాష్, రోహిణి, టేస్టీ తేజాలు కన్నడ బ్యాచ్ నిఖిల్, పృథ్వీ, యష్మి, ప్రేరణలకు గట్టి పోటీ ఇచ్చారు 

గత వారం ఎలిమినేషన్ తప్పించుకున్న అవినాష్ ఈ వారం ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతాడు అనుకుంటే ఈ వారం టికెట్ టు ఫినాలే షీల్డ్ గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ గా నేరుగా టాప్ 5 లోకి అడుగుపెట్టేసాడు. దానితో ఓటింగ్ లో వీక్ అయిన టేస్టీ తేజ డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా ముందుగా ఎలిమినేట్ అయ్యాడు. 

ఈ వారం ఓటింగ్ లో నిఖిల్, గౌతమ్ నెంబర్ 1 ప్లేస్ కోసం పోటీపడగా.. తర్వాత నబీల్, ప్రేరణ ఉండగా ఆతర్వాత విష్ణు ప్రియా ఉన్నారు, చివరి స్థానంలో పృథ్వీ, తేజ ఉన్నారు. టేస్టీ తేజ ఆల్రెడీ ఎలిమినేట్ అవ్వగా చివరిగా పృథ్వీ అయినా రాలేదంటే విష్ణు ప్రియా అయినా మరో ఎలిమినేషన్ లో హౌస్ ని వీడే అవకాశం ఉంది.   

Bigg Boss 8-Tasty Teja eliminated:

Tasty Teja has already been eliminated in Bigg Boss house

Tags:   TASTY TEJA