బిగ్ బాస్ సీజన్ 8లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది అనే ప్రచారాన్ని బిగ్ బాస్ నిజం చేస్తున్నారు. ఆ విషయాన్ని శనివారం ఎపిసోడ్ లోనే హోస్ట్ నాగార్జున కన్ ఫర్మ్ చేసేసారు. ఈరోజు ఎపిసోడ్ ప్రోమో ని వదిలారు. ముందుగా నాగార్జున ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పారు. ఆ తర్వాత అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచి ఎలిమినేషన్ తప్పించుకుని టాప్ 5 కి వెళ్లినందుకు కంగ్రాట్స్ చెప్పారు.
తర్వాత బ్లాక్ బ్యాడ్జ్ ఎవ్వరికి ఇవ్వాలని రోహిణిని అడిగితే రోహిణి పృథ్వీ పేరు చెప్పింది, అదేమిటి గౌతమ్ కూడా నాలుగు టాస్క్ లలో ఓడిపోయాడు అనగానే పృథ్వీ తాను ఆడుతుంది అంటాడు అనగానే, సర్ నా గురించి గౌతమ్ గురించి అడిగారు అని పృథ్వీ అడిగాడు రోహిణిని. నేను నా ఒపీనియన్ చెప్పాను అంది. ఇక గౌతమ్ ని బ్లాక్ బ్యాడ్జ్ ఎవరికి ఇవ్వాలని అంటే ప్రేరణ అన్నాడు, ఆమె బిహేవియర్ బాలేదు అన్నాడు, దానికి ప్రేరణ డిఫెండ్ చేసుకోబోతే నాగార్జున నువ్వు ఫెయిర్ గా ఆడావా అంటూ వీడియో వేసి చూపించారు.
ఆతర్వాత నీ ప్రకారం విన్నర్ ఎవరు ఈ హౌస్ లో అని విష్ణుప్రియని నాగ్ అడగగా మై అంది. మరి ఆట ఏది, విన్నర్ లా ఆడుతున్నావా అన్నారు నాగ్. నేను ఎఫర్ట్స్ పెట్టాను, టాస్క్ లు గెలిచిన వాళ్ళు టైటిల్ గెలవలేదు, వినర్స్ అవ్వలేదు అంది. ఆడియన్స్ విష్ణు ఆడే పద్దతి మీకు బావుందా అనగానే వాళ్ళు లేదు లేదు అంటూ విష్ణు కి షాకిచ్చిన ప్రోమో వైరల్ గా మారింది.