పుష్ప ద రూల్ ప్రమోషన్స్ తో నేషనల్ క్రష్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. పాట్నా ఈవెంటు నుంచి నిన్న ముంబై లో జరగిన పుష్ప ద రూల్ ఈవెంట్ వరకు సోషల్ మీడియాను చీరకట్టు తో రూల్ చేస్తున్న రశ్మికను గ్లామర్ విషయంలో ఎక్కువమంది పొగుడుతుంటే.. కొద్దిమంది మాత్రం చీప్ ట్రోల్స్ చేస్తున్నారు.
రష్మిక చక్కగా శారీ కట్టుకుని గ్లామర్ గానే పుష్ప2 ప్రతి ఈవెంట్ లో సందడి చేస్తుంది. అయితే కొంతమంది రష్మిక శారీ కట్టుకుని అమ్మాయిలా అందంగా కనిపించడం పక్కనపెట్టి ఆమె నడుస్తుంటే టామ్ బాయ్ కి చీరకట్టినట్టుగా అనిపిస్తుంది. ఆమె నడక అలానే ఉంది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో ఆమె కండలు కనిపిస్తున్నాయి.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
జిమ్ లో వర్కౌట్స్ చేసి బాడీ మంచి షేప్ మైంటైన్ చేస్తున్న రశ్మికలో అమ్మాయి లక్షణాలు లేవు, అంతా అబ్బాయి మాదిరి కనిపిస్తుంది, చీర కట్టి ఒయ్యారాలు పోకుండా ఆ అబ్బాయిలా నడకేంటి అంటూ చీప్ గా కామెంట్స్ చెయ్యడం సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. గతంలోనూ రష్మిక మైకేల్ జాక్సన్ లా ఉంది అనే కామెంట్స్ ని ఫేస్ చేసిన విషయం తెలిసిందే.