వరుణ్ తేజ్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా తెరకెక్కిన మట్కా చిత్రం నవంబర్ 14 న విడుదలైంది. మట్కా చిత్రానికి ఆడియెన్స్ నుంచి అలాగే క్రిటిక్స్ నుంచి కూడా యునానమస్ గా డిజప్పాయింట్ టాక్ వచ్చింది. దానితో మట్కా చిత్రంతో మెగా హీరో వరుణ్ తేజ్ మరో ప్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
మట్కా డిజిటల్ హక్కులను ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్.. ఈచిత్రాన్ని థియేటర్స్ లో విడుదలై మూడు వారాలు తిరక్కుండానే ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ చేసింది. డిసెంబర్ 5 నుంచి మట్కా చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.
మట్కా చిత్రాన్ని ఏకకాలంలో పాన్ ఇండియా భాషల్లో విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ తెలిపారు. థియేటర్స్ లో డిజప్పాయింట్ చేసిన మట్కా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.