బిగ్ బాస్ సీజన్ 8 ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చేసింది. సీజన్ 8 లో 13 వారాలు పూర్తయ్యి 14 వారంలోకి వెళ్ళిపోతుంది. గత వారం కన్నడ బ్యాచ్ నుంచి యష్మి గౌడ ఎలిమినేట్ అవ్వగా ఈ వారం కమెడియన్స్ vs కన్నడ బ్యాచ్ అన్న రేంజ్ లో నామినేషన్స్ జరిగాయి. రోహిణి మెగా చీఫ్ అవడం వలన ఆమె తప్ప మిగతా వారంతా నామినేషన్స్ లో ఉన్నారు.
అయితే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న గౌతమ్, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, విష్ణు ప్రియా, తేజ, అవినాష్ లలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయంలో సస్పెన్స్ నడుస్తుంది. కారణం నిన్నటివరకు అవినాష్, తేజ డేంజర్ జోన్ లో ఉంటే.. టికెట్ టు ఫినాలే రేస్ లో ఫస్ట్ ఫైనలిస్ట్ గా అవినాష్ గెలవడంతో అవినాష్ ఒక్కసారిగా ఓట్లు కొల్లగొట్టి సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయాడు.
దానితో లవ్ బర్డ్స్ గా బిగ్ బాస్ 8 లో ప్రొజెక్ట్ అయిన విష్ణుప్రియ, పృథ్వీలు డేంజర్ జోన్ కి వచ్చేసారు. గత కొన్నివారాలుగా విష్ణు ప్రియా పృథ్వీలు లక్కీగా సేవ్ అవుతున్నారు. కానీ ఈ వారం ఈ ఇద్దరిలో ఎవరో ఒకరా, లేదంటే ఇద్దరూ డబుల్ ఎలిమినేషన్ లో హౌస్ ని వీడుతారా అనేది తెలియాల్సి ఉంది.
ఇక టైటిల్ ఫెవరేట్ నిఖిల్ పై గౌతమ్ ఓటింగ్ లో కొద్దిరోజులుగా పై చెయ్యి సాధిస్తున్నాడు. బిగ్ బాస్ 8 టైటిల్ గౌతమ్ vs నిఖిల్ మధ్యలోకి వెళ్ళిపోయింది.