అక్టోబర్ 31 దీపావళి సందర్భంగా థియేటర్స్ లో విడుదలైన లక్కీ భాస్కర్, అమరన్, క, బఘీర చిత్రాలు వేటికవే ప్రత్యేకమైన జోనర్స్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. బఘీర అటు ఇటుగా ఆడినా లక్కీ భాస్కర్, అమరన్, క చిత్రాలు సూపర్ హిట్ అవడమే కాదు.. ఈ వారం అంటే ఈనెల 28 న లక్కీ భాస్కర్, క చిత్రాలు ఓటీటీలోకి స్ట్రీమింగ్ కి వచ్చేశాయి.
దానితో అమరన్ ఓటీటీ పై తీవ్రమైన ఆసక్తి మొదలైంది. అమరన్ విడుదలైన అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ టాక్ తో ఏకంగా 330 కోట్లు భారీ కలెక్షన్స్ రాబట్టింది, చాలామంది తమిళ హీరోలను దాటేసి శివకార్తికేయన్, సాయి పల్లవి ఈ రేర్ ఫీట్ ని అందుకోవడంతో ఓటీటీ ఆడియన్స్ లో అమరన్ పై విపరీతమైన క్యూరియాసిటి మొదలైంది.
అమరన్ ఓటీటీ రైట్స్ భారీ డీల్ తో సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు అమరన్ స్ట్రీమింగ్ డేట్ ఎదురు చూపులకు ఎండ్ కార్డు వేసింది. డిసెంబర్ 5 నుంచి అమరన్ పాన్ ఇండియా భాషల్లో నెట్ ఫ్లిక్స్ నుంచి అందుబాటులోకి రాబోతున్నట్టుగా పోస్టర్ వేసి మరీ ప్రకటించారు. మరి అమరన్ కోసం వెయిట్ చేస్తున్న ఓటీటీ ఆడియన్స్ కు ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పాలి.