హీరోయిన్ సమంత తో డివోర్స్ అయ్యాక నాగ చైతన్య చాలా తక్కువ సమయంలో మరో హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో ప్రేమలో పడడం చాలామందికి షాకిచ్చింది. చైతు-శోభిత లు ఇద్దరూ లండన్ వెకేషన్ కి వెళ్ళినప్పుడు ఓ రెస్టరెంట్ లో ఫుడ్ తింటూ దొరికిపోవడంతో వారి ప్రేమ విషయం బయటపడింది. కానీ ఆగష్టు 8న ఎంగేజ్మెంట్ అయ్యేవరకు చైతు-శోభిత వాళ్ళు తమ డేటింగ్ విషయాన్ని ప్రకటించలేదు.
డిసెంబర్ 4 న పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయిన నాగచైతన్య తాజాగా అసలు శోభితతో తనకి పరిచయం ఎలా ఏర్పడిందో, అది ప్రేమగా ఎప్పుడు మారిందో ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో అందరి అనుమానాలకు ఫుల్ స్టాప్ పడింది. సమంతతో విడాకులకు ముందు శోభితతో అసలు పరిచయం లేదు అని క్లారిటీ ఇచ్చాడు చైతు.
2023 లోనే మొదటిసారి శోభితను కలిశానని చెప్పాడు, అది కూడా ముంబై లో జరిగిన ఓ ఓటీటీ కార్యక్రమంలో తమకి పరిచయమైంది అని, మొదటిసారి మేము అప్పుడే కలిసి మాట్లాడుకున్నాం, ఆతర్వాత ఆ పరిచయం ప్రేమగా మారింది అని చెప్పిన చైతన్య గత కొన్ని నెలలుగా శోభిత, ఆమె ఫ్యామిలీ గురించి తెలుసుకోవడం చాలా హ్యాపీ గా ఉంది.
రెండు ఫ్యామిలీస్ వారు పెళ్లి రోజు కోసం వెయిట్ చేస్తున్నాము. శోభిత ఫ్యామిలీ నన్ను ఓ కొడుకులా చూసుకున్నారు. మా రెండు ఫ్యామిలీస్ సేమ్ ఉంటాయని, శోభిత ఓ ఫ్యామిలీ అమ్మాయి. మేమందరం కొన్ని పండగలు కలిసి చేసుకున్నాం అంటూ చైతు శోభితతో మొదలైన పరిచయంపై ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు.
నాగచైతన్య నటించిన దూత వెబ్ సీరీస్ కోసం ముంబై లో అమెజాన్ ప్రైమ్ వారు నిర్వహించిన ఓ కార్యక్రంలోనే శోభితతో చైతూకి పరిచమైనది, ఓటీటీ షో లాంచ్ కోసం ముంబై వెళ్ళినప్పుడు అదే ప్లాట్‌ఫామ్ తో శోభిత కూడా ఓ షో చేస్తోంది. ఆ ఓటీటీ ప్లాట్‌ఫామ్ హోస్ట్ చేసిన ఒక ప్రచార కార్యక్రమంలోనే మేమిద్దరం కలిసాం అంటూ నాగ చైతన్య చెప్పుకొచ్చాడు.