మెగా డాటర్ నిహారిక భర్త చైతన్య కు విడాకులు ఇచ్చాక నిర్మాతగా బిజీ అయ్యే ప్రయత్నాల్లో ఉంది. అప్పుడప్పుడు స్పెషల్ ఫోటో షూట్స్ తో మెస్మరైజ్ చేసే నిహారిక తన ఫ్రెండ్స్ మహాతల్లి, అలాగే వితిక లతో కలిసి హంగామా చేస్తూ వెకేషన్స్ కి వెళ్ళి ఎంజాయ్ చేస్తుంది.
తాజాగా నిహారిక వదిలిన శారీ లుక్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. చేనేత చీరలో స్టైలిష్ గా ఇచ్చిన ఫోజ్ నెట్టింట సంచలనంగా మారింది. నిహారిక లేటెస్ట్ శారీ లుక్ మాత్రం నిజంగా అదిరిపోయింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.