బిగ్ బాస్ 8 లో లవ్ ట్రాక్ నడుపుదామని ప్లాన్ చేసుకుని పృథ్వీ కి దగ్గరైన విష్ణు ప్రియకు మొదట్లో సోనియా రూపమ్ లో గట్టి కాంపిటీషన్ ఎదురైంది. అపుడు విష్ణు ప్రియా ఫోకస్ టాస్క్ లపై పెట్టింది. సోనియా వెళ్ళిపోయాక మెల్లగా పృథ్వీతో ఫ్రెండ్ షిప్ చేస్తూ అతన్ని సపోర్ట్ చేయడంతోనే విష్ణు ప్రియా ఆట మొత్తం సైడ్ కి వెళ్ళిపోయింది. ఈ విషయం హౌస్ మేట్స్ పదే పదే హెచ్చరించారు.
బయట కూడా విష్ణు ప్రియపై పృథ్వీ విషయంలో నెగిటివిటి పెరిగింది. పృథ్వీ పట్టించుకోకపోయినా.. విష్ణు అతని వెంటపడుతుంది అంటున్నారు, రీసెంట్ గా ఫ్యామిలీ వీక్ లో ఆమె తండ్రి ఇండివిడ్యువల్ గేమ్ ఆడమని పృథ్వీ విషయంలో హెచ్చరించారు. తర్వాత హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ బయట విష్ణు ప్రియపై వచ్చిన నెగిటివిటి ని డైరెక్ట్ గానే చెప్పారు, పృథ్వీ కి నీకు మధ్యలో ఏముందో చెప్పమని.
అఖిల్, వితిక అడిగినా పృథ్వీ ఏమి మాట్లాడలేదు, విష్ణు ప్రియా మాత్రం తాను ఫ్రెండ్, అంతకు మించి కూడా అంటూ పొలైట్ గా ఆన్సర్ ఇచ్చింది. అయితే గత రాత్రి ఎపిసోడ్ లో హౌస్ లోకి టికెట్ టు ఫినాలే టాస్క్ ఫైనల్ టాస్క్ కోసం శ్రీముఖి హౌస్ లోకి ఎంటర్ అయ్యింది. హౌస్ లో విష్ణు ప్రియని, పృథ్విని విడివిడిగా కూర్చోబెట్టి క్లాస్ పీకింది.
అతని వైపు నుంచి సిగ్నల్స్ లేకపోయినా నువ్వెందుకు అతనివైపు వెళ్తున్నావ్, అతను ఆడేటప్పుడు నువ్వు ఎందుకిలా ఎంకరేజ్ చేస్తూ నీ ఆట పాడుచేసుకున్నావ్, నా కోసం అతన్ని వదిలేయ్ అంటూ క్లాస్ పీకింది, అటు పృథ్వీ ని కూర్చోబెట్టి నువ్వు అఖిల్ వాళ్ళు అడిగినప్పుడు చెప్పాలి కదా, ఆ అమ్మాయి మీద ఫీలింగ్స్ లేవు అని, విష్ణుని అంటే చూస్తున్నావ్ అంటూ పృథ్వికి కూడా క్లాస్ పీకింది.
ఇది చూసాక పాపం విష్ణు ప్రియా వన్ సైడ్ లవ్ తో బాధపడాల్సి వస్తుంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.