Advertisementt

పవన్ కళ్యాణ్ ఒక సైన్యం.. టచ్ చేస్తే కల్లాస్

Sat 30th Nov 2024 09:47 AM
pawan  పవన్ కళ్యాణ్ ఒక సైన్యం.. టచ్ చేస్తే కల్లాస్
Pawan Kalyan is an army పవన్ కళ్యాణ్ ఒక సైన్యం.. టచ్ చేస్తే కల్లాస్
Advertisement
Ads by CJ

పవన్ ఒక సైన్యం.. టచ్ చేస్తే కల్లాస్

అవును.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సైన్యంలా దుసుకెళ్తున్నారు. పవన్ నేనొక్కడినే అంటూ.. అతడే ఒక సైన్యంలా ముందుకు కదులుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే సరైనోడి చేతిలోకి పవర్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది సినిమాల్లో అందరూ చూసే ఉంటాం కదా.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూపంలో నిజ జీవితంలో చూస్తున్నాం. ఈ మాటను వ్యతిరేకించే వాళ్లు ఉన్నప్పటికీ, అంతకుమించి సపోర్టు చేస్తున్న జనం ఉన్నారు.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఇంతకీ పవన్ కళ్యాణ్ నాడు చంద్రబాబు అరెస్ట్ మొదలుకుని ఇవాళ్టి వరకూ చేసిన ఘనకార్యాలు ఏంటి..? ప్రజలు, కూటమి పార్టీల నేతలు ఏమనుకుంటున్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి.

అంతా ఆయనే..!

సెంటర్ ఐనా.. స్టేట్ ఐనా ఏదైనా సరే నేను దిగనంత వరకే వన్స్ రంగంలోకి దిగితే సీన్ వేరే ఉంటుంది అని పవన్ కళ్యాణ్ రియల్ లైఫులో చేసి చూపిస్తున్నారు. ఇందుకు ఒకటా రెండా లెక్కలేనన్ని సంఘటనలు మన కళ్ళ ముందే జరిగినవే చక్కటి ఉదాహరణలు. నాడు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూటమిగా కలిసి ముందుకెళ్లాలనే ఆలోచన, వైసీపీని అదఃపాతాళానికి తొక్కి పడేస్తానన్న శపథం నిజం చేసి చూపించడం.. అనుకున్నట్టుగానే టీడీపీ కూటమి అధికారంలోకి రావడం ఇవన్నీ ఒక మిరాకిల్ అంతే. ఇందులో పవన్ పాత్ర చాలా కీలమైనది. అందుకేనేమో పవన్ అంటే గాలి కాదు.. ఆయనొక తూఫాను అని ప్రధాని నరేంద్ర మోదీ లాంటి పెద్ద మనిషి నోట వచ్చింది. ఇలాంటి మాటలు మోదీ నోట రావడం అంటే మామూలు విషయం కానే కాదు.

రంగంలోకి దిగితే..!

పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగితే ఏదైనా.. అది ఎంత పెద్ద సమస్య అయినా సరే దెబ్బకు సెట్ అవ్వాల్సిందే. ఎన్డీఏ కూటమి ఏపీలో గెలిచిన మరుక్షణం నుంచి శాంతిభద్రతలు, లా అండ్ ఆర్డర్ అనేది లేకుండా పోయింది. ఇందుకు నిన్న మొన్నటి వరకూ జరిగిన హత్యలు, అత్యాచారాలు, గొడవలే కారణం. అందుకే ఇవన్నీ చూడలేక నేరుగా పవన్ రంగంలోకి దిగి ఏకంగా హోం శాఖ మంత్రి వంగలపూడి అనితకే వార్నింగ్ ఇవ్వడంతో దెబ్బకు అన్నీ సెట్ అయ్యాయి. ఎంతలా అంటే నేరుగా సీఎం చంద్రబాబు కలుగజేసుకొని కొత్త చట్టం తీసుకొని వచ్చేంత. అంతకు మించి నేనే రంగంలోకి దిగి పోలీసు వ్యవస్థను నెల రోజులలో ప్రక్షాళన చేస్తాను అని ముఖ్యమంత్రి అనేంతలా పవన్ చేశారు. ఇందులో వేరేగా ఆలోచించడానికి ఏమీ లేదు.. మంచి జరిగితే మెచ్చుకోవాల్సిందే.

ఎలా ఉందో లుక్కేయండి..!

పవన్ ఎప్పుడైతే తాను హోం శాఖ తీసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుందని ఒకే ఒక్క మాట చెప్పడంతో ఇప్పుడు నేరస్తుల అరెస్టులు జరుగుతున్నాయి.. అంతకు మించి ఎక్కడ చూసినా డ్రోన్లు ఎగురుతూనే ఉన్నాయ్. ముఖ్యంగా నాడు సోషల్ మీడియా వేదికగా విర్రవీగి ప్రవర్తించిన వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి.. మరోసారి ఇలాంటి ప్రయత్నం చేయాలంటే భయపడిపోయేలా చేసింది పవన్ కళ్యాణ్ అంతే. దీనికితోడు ఎవరైతే అలసత్వం వహించకుండా ఆ అధికారులు సైతం అడ్రస్ లేకుండా పోతున్నారు. కులం, మతం, కుటుంబం, మన, తన లేకుండా బొక్కలో వేసి బొక్కలు ఇరగ్గోడుతున్నారు పోలీసులు.

ఇప్పుడు ఇక మాఫియాపై..!

వాస్తవానికి సముద్ర పరివాహక ప్రాంతాల్లో మాఫియా జాడలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే నేతలు, రౌడీలు అంతకు మించి గ్యాంగ్ ఇక్కడి నుంచే డ్రగ్స్, గంజాయి ఇలా ఏదైనా సరే ఎగుమతులు, దిగుమతులు చేస్తూ ఉంటుంది మాఫియా. సరిగ్గా ఇదే విషయాన్ని పట్టుకున్న పవన్ కళ్యాణ్.. మాఫియా అనేది కనిపించకూడదని కంకణం కట్టుకున్నారు. అందుకే కాకినాడ పోర్టుకు స్వయంగా వెళ్లి రేషన్ బియ్యం మాఫియా తాట తీశారు. తాను రంగంలోకి దిగక మునుపే ఆయన ఆదేశాల మేరకు కలెక్టర్ షాన్‌ మోహన్‌ పోర్టుకు వెళ్లి యాంకరేజీ పోర్ట్ నుంచి పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధమైన స్టెల్లా ఎల్‌ నౌకలో 640 టన్నుల బియ్యంతో రెడీగా ఉన్న నౌకను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ మరుసటి రోజు పవన్ రావడం, అసలేం జరుగుతోంది అని ఆరా తీయడం, పోర్టు అధికారులను నిలదీయడం, తనను ఆపాలని.. లోనికి వెళ్ళడానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకున్నా సరే వెళ్లి తీరారు. ఇక అధికారులపై చర్యలు తీసుకోవడం, పౌరసరఫరాల శాఖ అధికారులను ప్రశ్నించడం, లోకల్ ఎమ్మెల్యే కొండబాబుపై ఫైర్ కావడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. ఈ దెబ్బతో పేదల రేషన్‌ బియ్యం తరలింపు వ్యవహారానికి దాదాపు ఫుల్ స్టాప్ పడినట్టే. 1064 టన్నుల బియ్యం అంటే సుమారు ఆరున్నర కోట్లు విలువ చేసే బియ్యం తిరిగి పేదలకు చేరబోతోంది.

Pawan Kalyan is an army:

Andhra Deputy CM Pawan now pulls up Kakinada TDP MLA

Tags:   PAWAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ