డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టిడిపి ఎమ్మెల్యే వనమాడి కొండబాబుపై సీరియస్ అయిన ఘటన కాకినాడ పోర్టు వద్ద చోటు చేసుకుంది.
ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు వద్ద సముద్రంలో ప్రయాణించారు. రేషన్ బియ్యం పట్టుబడిన స్టెల్లా ఎల్ నౌక వద్దకు సముద్రంలో ప్రత్యేక బోట్ లో వెళ్లిన పవన్ కళ్యాణ్ నౌకలో ఉన్న 38 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఎవరు సరఫరా చేశారని అధికారులను పవన్ కళ్యాణ్ ఆరా తీసారు.
పోర్ట్ నుంచి ఇంత భారీగా రేషన్ బియ్యం అక్రంగా రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై ఆయన మండిపడ్డారు. ప్రజాప్రతినిధులు నాయకులు వచ్చి బియ్యం అక్రమ రవాణా ఆపితేగాని ఆపలేరా అంటూ ఆగ్రహం పవన్ ఆగ్రహం వ్యక్తం చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. అక్రమ రేషన్ బియ్యం యదేచ్చగా షిప్ నుంచి తరలిపోతుంటే ఏం చేస్తున్నారని జిల్లా అధికారులను పోర్టు అధికారులను ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ టిడిపి ఎమ్మెల్యే వనమాడి కొండబాబుపై సీరియస్ అయ్యారు.
పోర్ట్ కి రేషన్ రైస్ వస్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏమి చేస్తుందని పవన్ ప్రశ్నించగా సమాధానం చెప్పలేక నీళ్లునమిలిన అధికారులు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు పై చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చిన పవన్