దీపావళి సందర్భంగా అక్టోబర్ 31 న థియేటర్స్ లో విడుదలైన లక్కీ భాస్కర్, అమరన్, క చిత్రాలు మూడు వేటికవే డిఫ్రెంట్ జోనర్స్ తో సూపర్ హిట్స్ కొట్టాయి. లక్కీ భాస్కర్ గా దుల్కర్ సల్మాన్ 110 కోట్లు వసూలు చేస్తే.. క చిత్రంతో కిరణ్ అబ్బవరం మొదటిసారి 50 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టాడు. ఇక తమిళనాట తెరకెక్కిన అమరన్ తెలుగులోనూ అద్భుతమైన హిట్ అయ్యింది.
దివాళి సందర్భంగా థియేటర్స్ లో విడుదలైన లక్కీ భాస్కర్, క అప్పుడే ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చేసాయి. లక్కీ భాస్కర్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీ నుచి నిన్న అంటే నవంబర్ 28నుంచి స్ట్రీమింగ్ లోకి రాగా.. కిరణ్ అబ్బవరం క చిత్రం ఈటీవీ విన్ నుంచి నవంబర్ 28 నుంచి ఓటీటీ లోకి వచ్చేసింది. ఇవి రెండు ఓకె.
అదే రోజు విడుదలైన అమరన్ ఓటీటీ విషయంలోనే ఇంకా సస్పెన్స్ నడుస్తుంది. శివకార్తికేయన్, సాయి పల్లవిల అమరన్ దాదాపుగా 300 కోట్ల మార్క్ దగ్గరకు వెళ్ళింది, థియేటర్స్ లో అంతో ఇంతో కలెక్షన్స్ తెస్తున్న అమరన్ చిత్రాన్ని ఓటీటీలో తెచ్చెందుకు మేకర్స్ ఆలోచిస్తున్నారు.
అందుకే అమరన్ ఓటీటీ రిలీజ్ లేట్ అయిట్లుగా తెలుస్తుంది. డిసెంబర్ 5 నుంచి అమరన్ నెట్ ఫ్లిక్స్ నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.