Advertisementt

పుష్పా.. కోచి లో కూడా ఒక్కటి తగ్గింది

Thu 05th Dec 2024 04:24 PM
  పుష్పా..  కోచి లో కూడా ఒక్కటి తగ్గింది
No Fahadh Faasil at Pushpa 2 Promotions పుష్పా.. కోచి లో కూడా ఒక్కటి తగ్గింది
Advertisement
Ads by CJ

పుష్ప 2 ద రూల్ ప్రమోషన్స్‌ను అల్లు అర్జున్ ఎంత వేగంగా చేస్తున్నారో అంతకు మించి క్రేజ్ పుష్ప 2 పై పెరిగిపోతుంది. సుకుమార్ ఇంకా ఇంకా పుష్ప 2 పనుల్లో తలమునకలై ఉంటే అల్లు అర్జున్, రష్మిక అలాగే పుష్ప నిర్మాతలు ప్రమోషన్స్‌ను భుజాల మీద మోస్తున్నారు. అల్లు అర్జున్ ప్రాణం పెట్టి సినిమాని ఎలా అయితే పూర్తి చేశారో.. అలాగే ప్రమోషన్స్ విషయంలో కూడా తగ్గేదేలే అంటున్నారు. 

అయితే పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ దగ్గర నుంచి చెన్నైలో జరిగిన పుష్ప ఈవెంట్, కొచ్చిలో జరిగిన పుష్ప ఈవెంట్ వరకు పుష్ప లో నటించిన ముఖ్యంగా విలన్ రోల్ పోషించిన ఫహాద్‌ ఫాజిల్‌ కనిపించకపోవడం ఆయన అభిమానులను విస్మయానికి గురి చేసింది. కేరళ కొచ్చి ఈవెంట్‌లో అయినా ఆయన ఉంటారని ఎక్స్‌పెక్ట్ చేశారు అభిమానులు. 

పుష్ప 2 ద రూల్ లో అల్లు అర్జున్‌తో పాటుగా ఎంతో కీలకమైన పాత్ర పోహించిన ఫహాద్‌ ఫాజిల్‌ పుష్ప 2 ప్రమోషన్స్‌లో కనిపించకపోవడం విచిత్రమే. మరి ఆయన కనీసం హైదరాబాద్‌లో జరిగే పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అయినా కనిపిస్తారో, లేదో. అసలే సుకుమార్ కోసమే భన్వర్ సింగ్ షెకావత్ కేరెక్టర్ ఒప్పుకున్నాను, నాకు పుష్ప‌లో నటించాలని లేదు అన్నారు. ఇప్పుడు చూస్తే సినిమాకి ఎంతో కీలకమైన ప్రమోషన్స్‌కి కూడా ఆయన డుమ్మా కొట్టారు.

No Fahadh Faasil at Pushpa 2 Promotions:

Where is Fahadh Faasil.. Fans Asking

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ