Advertisementt

సిగ్గుంటే మళ్ళీ బిగ్ బాస్‌కి వెళ్లరు

Thu 28th Nov 2024 05:13 PM
  సిగ్గుంటే మళ్ళీ బిగ్ బాస్‌కి వెళ్లరు
Bigg Boss Telugu Old Contestants Sensational Comments on Bigg Boss Show సిగ్గుంటే మళ్ళీ బిగ్ బాస్‌కి వెళ్లరు
Advertisement
Ads by CJ

బిగ్ బాస్‌కి వెళ్లొచ్చిన కొంతమంది సెలెబ్రిటీస్ ఇప్పుడు బిగ్ బాస్‌కి మళ్లి వెళితే మాత్రం సిగ్గులేదనే చెప్పాలి, బిగ్ బాస్‌కి వెళ్ళకముందు అంతో ఇంతో ఉన్న క్రేజ్, పేరు.. బిగ్ బాస్‌కి వెళ్ళాక పూర్తిగా పోవడమే కాదు ఆ ట్రోల్స్, ఆ నెగిటివిటి చూస్తే కెరీర్ మొత్తం పోవడమే కాదు, జీవితంలో మళ్లీ కనిపించరు, బిగ్ బాస్‌కి ఒకసారి వెళ్ళినవాళ్ళు సిగ్గుంటే మళ్ళీ బిగ్ బాస్‌కి వెళ్ళరు అని అంటున్నారు.

ఇంతకీ ఈమాట అన్నది ఎవరో కాదు.. బిగ్ బాస్ రెండో సీజన్‌లోకి వెళ్లిన తేజస్వి మదివాడ. బిగ్ బాస్‌కి వెళ్ళాక అందులో విన్నర్ అయిన కౌశల్ ఏమైపోయాడో తెలియదు. అతని వలన మేము చాలా మాటలు పడాల్సి వచ్చిది, అతని ఆర్మీ మమ్మల్ని టార్గెట్ చేసింది. ఆ సీజన్‌లో విన్నర్ వలన ఆఖరికి హోస్ట్ కూడా మారిపోయాడు. బుద్దున్నోడు, సిగ్గున్నోళ్లు ఎవరూ బిగ్ బాస్‌కి మరోసారి వెళ్లరు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. కానీ మరో సీజన్‌కి తను వెళ్ళింది మాత్రం ఆ నెగిటివిటి పోగొట్టడానికే అంటూ చెప్పుకొచ్చింది. 

ఇక చలాకి చంటి అయితే బిగ్ బాస్‌కి వెళ్లొచ్చాక తనకి ఎలాంటి ఆఫర్స్ రావడం లేదు అని, బిగ్ బాస్ వలన కెరీర్ పోయింది అంటూ కామెంట్స్ చేశాడు. నిన్నగాక మొన్న సోనియా ఆకుల బిగ్ బాస్ యజమాన్యంపై చేసిన కామెంట్స్ అందరూ చూశారు. బిగ్ బాస్‌కి వెళ్లొచ్చాక తనపైవచ్చిన ట్రోల్స్ చూసి ఆత్మహత్య చేసుకుంటే ఎవరు బాద్యులు. అక్కడ జరిగేది ఒకటి, ఇక్కడ చూపించేది మరొకటి అంటూ బిగ్ బాస్‌పై సోనియా ఆకుల చేసిన కామెంట్స్ చూస్తే ఇకపై ఎవరూ బిగ్ బాస్‌కి వెళ్లే సాహసం చేయరేమో.

Bigg Boss Telugu Old Contestants Sensational Comments on Bigg Boss Show:

Tejaswi Madivada Comments on Bigg Boss Show

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ