Advertisementt

నెగిటివ్ పాత్రలో ఎన్టీఆర్.. ఫ్యాన్స్‌కి పండగే

Thu 28th Nov 2024 05:13 PM
  నెగిటివ్ పాత్రలో ఎన్టీఆర్.. ఫ్యాన్స్‌కి పండగే
Jr NTR Playing Negative Role In Hrithik Roshan Starring War 2 నెగిటివ్ పాత్రలో ఎన్టీఆర్.. ఫ్యాన్స్‌కి పండగే
Advertisement
Ads by CJ

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ స్టామినా ఏమిటో దేవరతో ప్రూవ్ అయ్యింది. సింగిల్ హ్యాండ్‌తో రూ. 500 కోట్లు కొల్లగొట్టిన ఎన్టీఆర్.. ఇప్పుడు వార్ 2తో బాలీవుడ్ డెబ్యూకి రెడీ అయ్యారు. హృతిక్ రోషన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ వార్ 2 షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ముంబైలో వార్ 2 షూటింగ్ చకచకా జరిగిపోతుంది. 

ఈ చిత్రంలో ఎన్టీఆర్ నెగెటివ్ రోల్‌లో కనిపించబోతున్నారట. ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్ రోల్ ఫ్యాన్స్‌కి పక్కా పండగే అంటున్నారు, హృతిక్ రోషన్-ఎన్టీఆర్ మధ్యన బిగ్ యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయట, 15 నిమిషాలు సాగే హ్యాండ్ - హ్యాండ్ ఒక ఫైట్ మాత్రం వార్ 2కి హైలెట్‌గా నిలవడమే కాదు.. మాస్ ఆడియన్స్‌కి ఫుల్ మీల్స్‌లా ఉంటుందని యూనిట్ వర్గాలు అంటున్నాయి. 

హృతిక్ రోషన్-ఎన్టీఆర్ కాంబో సీన్స్ మొత్తం అదిరిపోతాయని తెలుస్తుంది. ఈ చిత్రంలో హృతిక్‌కి జోడిగా కియారా అద్వానీ నటిస్తుండగా.. క్రేజీ హీరోయిన్ శ్రద్దా కపూర్, హృతిక్-ఎన్టీఆర్ కాంబో‌లో స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతోంది. త్వరలోనే ఈ మూవీ అప్డేట్స్‌ని మేకర్స్ వదలనున్నారని తెలుస్తోంది.

Jr NTR Playing Negative Role In Hrithik Roshan Starring War 2:

Jr NTR will play an Indian agent in the film War 2    

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ