Advertisementt

అఖిల్ పెళ్లి అప్పుడే-నాగార్జున

Thu 28th Nov 2024 05:13 PM
  అఖిల్ పెళ్లి అప్పుడే-నాగార్జున
King Nagarjuna Gives Clarity on Akhil Marriage అఖిల్ పెళ్లి అప్పుడే-నాగార్జున
Advertisement
Ads by CJ

అక్కినేని అఖిల్ రెండు రోజుల క్రితమే జుల్ఫీ రావుద్జీ కుమార్తె ప్రముఖ ఆర్టిస్ట్ జైనాబ్ రావుద్జీ‌తో నిచ్చితార్ధం చేసుకుని షాకిచ్చాడు. నాగార్జున తన ఇంట్లోనే అఖిల్-జైనాబ్‌ల నిశ్చితార్ధాన్ని ఇరు కుటుంబ సభ్యుల నడుమ సింపుల్‌గా జరిపించేసి ఆ విషయాన్ని అనౌన్స్ చేశారు. నాగ చైతన్య-శోభితల పెళ్లి పనుల్లో బిజీగా వున్న సమయంలో అఖిల్ నిశ్చితార్ధం చేయడం అందరికీ నిజంగానే షాకిచ్చింది. 

అయితే ఈ ఏడాది తమకు చాలా ప్రత్యేకమని తన తండ్రి అక్కినేని నాగేశ్వరావు శత జయంతి ఉత్సవాలు జరగడం, అలాగే నాగ చైతన్య వివాహం, ఇప్పుడు అఖిల్ నిశ్చితార్థం అవడం అన్ని తమ ఫ్యామిలీకి చాలా సంతోషాన్ని ఇచ్చిందని.. నాగార్జున అఖిల్ నిశ్చితార్ధం సందర్భంగా చెప్పారు. అయితే చైతు పెళ్లి నేపథ్యంలో అఖిల్ పెళ్లి ఎప్పుడు ఉంటుందనే ఆరాలు మొదలయ్యాయి. 

తాజాగా నాగార్జున అఖిల్ పెళ్లి పై స్పందించారు. జైనాబ్ రావుద్జీ‌ తమ ఇంటికి కోడలిగా రావడం చాలా సంతోషంగా ఉంది. ఆమె అందమైన అమ్మాయి, అఖిల్-జైనాబ్ రావుద్జీ‌ కలిసి జీవితాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. జైనాబ్ రావుద్జీ‌-అఖిల్ సరైన జోడి,ఇక అఖిల్ పెళ్లి వచ్చే ఏడాది ఉంటుంది అంటూ నాగ్, అఖిల్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు.

King Nagarjuna Gives Clarity on Akhil Marriage:

King Nagarjuna About Akhil Akkineni Marriage

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ