Advertisementt

చీర కట్టుతో కనికట్టు చేస్తున్న రష్మిక

Thu 28th Nov 2024 05:13 PM
rashmika mandanna  చీర కట్టుతో కనికట్టు చేస్తున్న రష్మిక
Rashmika Mandanna in Saree చీర కట్టుతో కనికట్టు చేస్తున్న రష్మిక
Advertisement
Ads by CJ

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఈ మధ్యన సినిమాల విషయంలో కన్నా ఎక్కువగా విజయ్ దేవరకొండతో డేటింగ్ రూమర్లుతోనే హైలెట్ అవుతుంది. విజయ్ దేవరకొండతో ఈమధ్యన బ్రేక్ ఫాస్ట్ చేస్తూ దొరికిన రష్మికను నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. అదలా ఉంటే.. ప్రస్తుతం రష్మిక మందన్నా పుష్ప 2 ప్రమోషన్స్‌లో చాలా స్పెషల్‌గా కనిపిస్తుంది. 

చీర కట్టుతో కనికట్టు చేస్తుంది. పాట్నా ఈవెంట్ మొదలు చెన్నై పుష్ప ఈవెంట్, నిన్న జరిగిన కొచ్చి ఈవెంట్ వరకు చక్కటి చీరలతో నిజంగా మాయ చేస్తుంది. అల్లు అర్జున్‌తో కలిసి పుష్ప 2 ప్రమోషన్స్ కోసం కలయతిరుగుతుంది. ఇక పుష్ప 2 షూటింగ్ పూర్తి కావడంతో ఎమోషనల్ అవుతూ నోట్ షేర్ చేసింది. 

సాయంత్రానికి కొచ్చి ఈవెంట్ కోసం అందంగా రెడీ అయ్యింది. ఎల్లో శారీలో రష్మిక మందన్నా నిజంగా బంగారు వర్ణంతో మెరిసిపోయింది. ఆ చీరలో రష్మిక అందాలు మరింత బ్రైట్‌గా కనిపించాయంటే అతిశయోక్తి కాదు. పుష్ప 2 తర్వాత ఆమె బాలీవుడ్‌లో చేస్తున్న మూవీ అప్డేట్ కూడా వచ్చేసింది. చూస్తుంటే.. మరికొన్ని రోజుల పాటు రష్మిక పేరు మోగిపోయేలా ఉంది. 

Rashmika Mandanna in Saree:

Rashmika Mandanna Saree Look Goes Viral     

Tags:   RASHMIKA MANDANNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ