జనసేన అధ్యక్షలు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఢిల్లీలో చాలా బిజీగా వున్నారు. అక్కడ ఆయన పలువురు కేద్ర మంత్రులను, ప్రధాని మోడీ తో సమావేశమవుతున్నారు. జనసేన పోటీ చేసిన స్థానాలను అన్నిటిని గెలిపించుకున్న పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో ముఖ్య పాత్ర పోషించడమే కాదు, కేంద్రంలో ప్రధాని మోడీ, బీజేపీ లతో తత్సంబందాలు కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన చూస్తుంటే పవన్ కళ్యాణ్ మెల్లగా స్ట్రాంగ్ అవుతున్నారనిపించేలా ఉంది. ఒకేరోజు ఢిల్లీలో ఆరుగురు కేంద్ర మంత్రులతో భేటీ కావడం, ఉప రాష్ట్రపతితో ఆత్మీయ డిన్నర్ సమావేశం, మరోపక్క ఈరోజు రాత్రి హైదరాబాద్ లో బీజేపీ, టీడీపీ, జనసేన ఎంపీలకు ఆతిధ్యం ఇవ్వడం ఇవన్నీ పవన్ కళ్యాణ్ పవర్ తెలియజేస్తున్నాయి.
మరి పవన్ కళ్యాణ్ ఏపీకి అందులోను అమరావతికి ట్రైన్ వేసిన సందర్భంగా పీఎం మోడీకి కృతఙ్ఞతలు చెప్పడానికి ఢిల్లీ వచ్చా అన్నారు. ఇలా పవన్ కళ్యాణ్ ఏపీ కి మంచి పనులు చెయ్యడం, అలాగే ఏపీ అభివృద్ధి కోసం పవన్ ఢిల్లీ పెద్దలను కలవడం ఇవన్నీ చూస్తుంటే ఏపీ ప్రజల గుండెల్లో పవన్ స్థానం పదిలం అయ్యేలా ఉంది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బలాన్ని పెంచుకుని 2029 ఎన్నికల సమయానికి జనసేనతో అతి పెద్ద పార్టీ గా అవతరించడం ఖాయమనేలా ఉంది.