Advertisementt

అబ్బో.. సుబ్బరాజు పెళ్లికొడుకాయెనే !

Wed 27th Nov 2024 12:17 PM
subbaraju  అబ్బో.. సుబ్బరాజు పెళ్లికొడుకాయెనే !
Subbaraju gets married అబ్బో.. సుబ్బరాజు పెళ్లికొడుకాయెనే !
Advertisement
Ads by CJ

కేరెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు, పూరి జగన్నాథ్ సినిమాలన్నిటిలో సుబ్బరాజు కనిపిస్తారు. ఆయన తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత తన భార్యతో కలిసి బీచ్ లో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. తన పెళ్లి విషయాన్ని అనౌన్స్ చేశారాయన. ప్రస్తుతం సుబ్బరాజు పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 

భీమవరంలో పుట్టి పెరిగిన సుబ్బరాజు సినిమా ఇండస్ట్రీలోకి అనుకోకుండా వచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. కృష్ణవంశీ చిత్రం ఖడ్గం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సుబ్బరాజు స్టార్ హీరోలందరితో కలిసి పని చేసారు. 

ప్రస్తుతం సుబ్బరాజు 47 ఏళ్ళు. ఇప్పటివరకు సింగిల్ గా కనిపించిన ఆయన ఈ లేటు వయసులో పెళ్లి చేసుకుని తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టడంతో.. ఆయన స్నేహతులు, సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు సుబ్బరాజుకు జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

Subbaraju gets married:

Tollywood Actor Subbaraju Gets Married

Tags:   SUBBARAJU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ