బిలియనీర్ గౌతమ్ అదానీ వ్యవహారం దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనమే అయ్యింది. దీంతో అదానీ మాకు వద్దు బాబోయ్ అంటూ అదానీ గ్రూపుతో చేసుకున్న అన్ని ఒప్పందాలను రద్దు చేసే పనిలో ప్రపంచ దేశాలు నిమగ్నం అయ్యాయి. ఇది కాస్త ఇండియాకు, మన పక్క రాష్ట్రం తెలంగాణ కూడా అదే లనులో ఉంది. ఈ క్రమంలోనే అదానీ ఇచ్చిన వంద కోట్ల రూపాయలను వాపస్ ఇచ్చేశారు కూడా. శిష్యుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంతో.. గురువుకు ఏమైంది..? ఎందుకు రద్దు చేయట్లేదు..? మీకు కూడా తెరవెనుక ముడుపులు ముట్టాయా..? అంటూ సర్వత్రా ప్రశ్నల వర్షం కురిపించారు.
వివాదం లేకుండా..!
ఇప్పటికే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రా పరువును అంతర్జాతీయ స్థాయిలో తీశారని గట్టిగానే తిట్టిపోస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో అసలే ఆర్థికంగా సరిగ్గా లేని రాష్ట్రంలో ఏం చేసినా ఆచితూచి సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నట్టు తెలియవచ్చింది. ముఖ్యంగా పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం పడకుండా అదానీతో కటీఫ్ చేసుకోవాలని భావిస్తున్నారని తెలిసింది. ఈ మధ్యనే విద్యుత్ సమీక్షలో ఓ నిర్ణయానికి రాగా, ఇంకా ఏం చేయొచ్చు..? ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది..? అని న్యాయ నిపుణులు, రాజకీయ విశ్లేషకుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
వాట్ నెక్స్ట్..?
అదానీకి వ్యవహారంలో ఇప్పుడూ ఏ మాత్రం నిర్ణయం తీసుకున్నా రూ. 1750 కోట్ల రూపాయలను వెనక్కి ఇచ్చి తీరాల్సిందే. ఇలా ఇంకా జగన్ ఇంకా ఎన్ని డీల్స్ చేశారు..? అని లోతుగా అధ్యయనం చేస్తోంది. దీనికి తోడు అదానీతో పక్కగా చంద్రబాబు కటీఫ్ చెబుతారని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే వాస్తవానికి మునుపటిలా ప్రధాని నరేంద్ర మోదీతో అదానీ సత్సబంధాలు లేవు. దీంతో అటు మోదీ.. ఇటు చంద్రబాబు ఇద్దరూ కీలక నిర్ణయం తీసుకుంటారని సమాచారం. అతి త్వరలోనే ఈ వ్యవహారంపై అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిసింది. ఏం జరుగుతుందో చూడాలి మరి.