Advertisementt

పొలిటికల్ గేమ్ లో పావులా మారిన పుష్ప

Tue 26th Nov 2024 09:19 PM
pushpa 2  పొలిటికల్ గేమ్ లో పావులా మారిన పుష్ప
Will Pushpa get crushed in the political game పొలిటికల్ గేమ్ లో పావులా మారిన పుష్ప
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ పుష్ప చిత్రం పొలిటికల్ గేమ్ లో పావులా మారిందా అంటే అవుననే సమాధానమే వస్తుంది. అల్లు అర్జున్ మా వాడు అంటూ తమ పార్టీలో కలిపేస్తున్నారు వైసీపీ నేతలు, జనసైనికులు మరోపక్క పుష్ప పై ఆగ్రహం వ్యకం చేస్తున్నారు. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ విషయంలో ప్రవర్తిస్తున్న తీరు వారికి నచ్చడం లేదు. 

మరోపక్క వైసీపీ కాండిడేట్ శిల్ప రవికి అల్లు అర్జున్ స్నేహతుడు కావడం, ఆయన కోసం నంద్యాల వెళ్లడం అన్ని వైసీపీ తమ పార్టీకి అనుకూలంగా చేసుకుని అల్లు అర్జున్ చుట్టమన్నట్టు మాట్లాడుతుంది. మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ని దూరం పెట్టింది అంటూ అల్లు అర్జున్ మావాడే అని మాట్లాడుతున్న వైసీపీ నేతలు, పుష్ప ని మెగా ఫ్యామిలీ తొక్కేసినా మేము ఆదుకుంటామని వారు ఇచ్చే బిల్డప్ మాములుగా లేదు. 

మరోపక్క జనసేన కార్యకర్తలు, అభిమానులు పుష్ప 2 ని ఇక్కడ ఎవరూ అడ్డుకోవడం లేదు, సినిమా బావుంటే ఆడుతుంది, స్టామినా ఉంటే వర్కౌట్ అవుతుంది అంటూ మాట్లాడుతున్నారు. మరోపక్క సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పుష్ప 2 నెగెటివ్ టాక్ కోసం వెయిట్ చేస్తున్నారు. కాస్త నెగెటివ్ టాక్ వచ్చినా పుష్ప ని తొక్కేయ్యడానికి రెడీగా ఉన్నారు. 

ఇక జనసేన, వైసీపీ పార్టీల మధ్యన పుష్ప 2 నలిగిపోతుందా, లేదా అనేది డిసెంబర్ 5 న తెలుస్తుంది. ఇక పుష్ప 1 తెలుగు రాష్ట్రాల్లో సో సో గా ఆడినా నార్త్ ఆడియన్స్ పుష్ప1 ని బిగ్ హిట్ చేసారు. ఇప్పుడు పుష్ప 2 పై కూడా నార్త్ లో ఉన్న క్రేజ్ చూస్తే.. అబ్బో అల్లు అర్జున్ స్టామినా మాములుగా లేదు అనాల్సిందే. 

Will Pushpa get crushed in the political game:

Pushpa 2 update 

Tags:   PUSHPA 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ